నైట్రోజన్‌తో మరణశిక్ష.. ప్రపంచంలోనే తొలిసారి.. ఎక్కడో తెలుసా?

by Anjali |
నైట్రోజన్‌తో మరణశిక్ష.. ప్రపంచంలోనే తొలిసారి.. ఎక్కడో తెలుసా?
X

దిశ, ఫీచర్స్: వాయు రూపంలో ఉండే నైట్రోజన్‌ను మనకు తెలియకుండానే మన రోజువారీ జీవితంలో ఉపయోగిస్తుంటాం. దీనికి తెలుగులో నత్రజని అని నామకరణం చేశారు. నైట్రోజన్ వాతావరణంలో విరివిగా ఉంటుంది. నైట్రోజన్‌ను ఫార్మా నుంచి మైనింగ్‌, ఫుడ్‌ బెవరేజ్‌, మెటల్, ఎలక్ట్రానిక్‌ వంటి అనేక పరిశ్రమల్లో వాడుతారు. నైట్రోజన్ ఆహార పదార్థాలు నిల్వ ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్‌ తాకడం వల్ల ఆహార పదార్థాలు, కూరగాయలు తొందరగా పాడైపోతాయి.

అలాగే చిప్స్‌ లాంటి ఫుడ్‌ స్టోరేజ్‌ చేసే ప్యాకెట్స్‌లో గాలిరూపంలో ఉండే నైట్రోజన్‌ను నింపుతారు. దీన్ని ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమలో లైట్‌ బల్బుల్లో కూడా వాడుతారు. నైట్రోజన్‌ వాయువును కార్లు, విమానాలు, బైక్‌ టైర్లలో కూడా నింపడానికి ఉపయోగిస్తారు. అయితే నైట్రోజన్‌తో ఉపయోగాలున్నప్పటికీ దీంతో ప్రాణహాని కూడా ఉందని మీకు తెలుసా?

అయితే కామన్‌గా నేరం చేసిన వ్యక్తికి ఉరితాడుతో మరణశిక్ష వేస్తారు. ఆ ఉరితాడుతో వేలాడదీస్తారు. పలు దేశాల్లో కాల్చి చంపేస్తారు, మరికొన్ని దేశాల్లో కత్తులతో తల నరికేస్తారు. కానీ ఓ వ్యక్తిని నైట్రోజన్‌తో మరణశిక్ష వేశారు. వినడానికి వింతగా ఉన్న మీరు విన్నది నిజమే. నైట్రోజన్‌ వాయువును పీల్చేలా చేసి అమలు చేసిన మరణశిక్షకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. 1000 డాలర్లు తీసుకుని తన స్నేహితులతో కలిసి ఒక మహిళను దారుణంగా చంపిన కేసులో కెన్నెత్ యుగెన్ స్మిత్ అనే 58 ఏళ్ల వ్యక్తిని ఇటీవల నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష వేశారు.

ఎలాగంటే..? కెన్నెత్ ముఖానికి ముందుగా ఫేస్ మాస్క్ పెట్టారు. తర్వాత స్వచ్ఛమైన నైట్రోజన్ గ్యాస్ పంపారు. ఇక నైట్రోజన్‌ను పీల్చుకున్న 2 నిమిషాల అనంతరం ఈ వ్యక్తి చనిపోయారు. నైట్రోజన్ గ్యాస్ ద్వారా మరణ శిక్ష విధించడం.. దేశంలోనే కాదు.. ప్రపంచలోనే మొదటిసారి. ఈ వార్త విన్న నెటిజన్లు నైట్రోజన్‌తో మరణశిక్ష ఏంటి? అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed