Death Of Love : డెత్ ఆఫ్ లవ్.. వాలెంటైన్స్ వీక్ స్పెషల్..

by Sujitha Rachapalli |
Death Of Love : డెత్ ఆఫ్ లవ్.. వాలెంటైన్స్ వీక్ స్పెషల్..
X

దిశ, ఫీచర్స్ : ప్రేమ ఒకప్పుడు అద్భుత కథ. యువరాజు.. కలల రాణి.. రక్షణ.. పోరాటం.. గెలుపు.. ఆ తర్వాత అందమైన జీవితం. ఆశ, వాగ్దానాలతో మురిసి మెరిసిపోయిన గాథలు ఎన్నో ఎన్నెన్నో. కానీ ఇప్పుడంత సీన్ లేదు. ప్రేమ చచ్చిపోయింది. హార్ట్‌ చెప్పినట్లు వినాల్సిన ప్రేమ మైండ్ గేమ్ ఆడుతుంది. స్వార్థంతో మునిగిపోతుంది. మానసిక గాయాలను బహుమతిగా ఇస్తుంది. ప్రపంచమంతా ఒక్కటైనా సరే నేనున్నానంటూ పక్కన నిల్చుండాల్సిన ప్రేమ.. ముందుగా తానే మోసం చేస్తానంటోది. నిజంగా ఇప్పటికీ సోల్ మేట్స్ అనే కాన్సెప్ట్ ఉందా.. ? డౌటే..

స్వార్థం

నేటి ప్రేమ నిస్వార్థంగా లేదు. నియంత్రిస్తుంది. వ్యక్తిగత సంతృప్తిని కోరుకుంటుంది. ఫాంటసీని ఫుల్ ఫిల్ చేసుకుంటుంది. సౌకర్యవంతంగా లేనప్పుడు గుడ్ బై చెప్పేస్తుంది. ఆ ప్లేస్‌లో ఈజీగా ఇంకొకరిని ఎంచుకుంటుంది. మూవ్ ఆన్ అయితే బాగుంటుందని సలహాలు ఇస్తుంది. కానీ నిజంగా ప్రేమంటే ఇదేనా? నిజమైన ప్రేమ త్యాగాలు చేస్తుంది. ఎదుటి వ్యక్తి ఆనందాన్ని చూసి సంతోషపడుతుంది. వారి నొప్పిని చిరునవ్వుగా మార్చేందుకు ఆరాటపడుతుంది. కానీ ఈ జనరేషన్‌కు ఇదంతా ఓ సిల్లీ థింగ్.

వెతుకులాట

రియల్ లవ్ ఎప్పటికీ అదే స్పార్క్‌తో ఉంటుంది. సోల్ మేట్స్ అంతే కనెక్టివిటీతో ముందుకు సాగుతారు. కానీ ఈ డిజిటల్ యుగంలో ఇలాంటి కనెక్షన్‌కు లెక్కలేనన్ని అంతరాయలు వచ్చేస్తున్నాయి. మెరుగ్గా ఉండాలనే భావనతో ఎంచుకున్న దాన్ని విలువైనదిగా తీర్చిదిద్దుకునేందుకు బదులుగా వెతుకులాటలోనే గడిపేస్తున్నారు. ఇది పార్ట్‌నర్స్ మధ్య అశాంతి, డిస్‌కనెక్షన్‌కు దారితీస్తుంది.

సందేహం

ఒకప్పుడు ప్రేమ భక్తితో కూడుకున్నది. కానీ ఇప్పుడు మాయని మచ్చలు, శాశ్వత సందేహాలకు చిరునామాగా మారుతోంది. అడగకపోయినా అర్థం చేసుకుని అన్నీ ఇచ్చే పవిత్ర ప్రేమ మసకబారిపోతుంది. ఎప్పటికి ఒక్కటిగా ఉందామని చేసే పోరాటంలో కష్టమొచ్చి సహాయం కోరితే చేయి అందించేందుకు సందేహిస్తుంది. ద్రోహం చేస్తుంది.

అలసత్వం

ఆధునిక ప్రేమల్లో సహనం కనిపించదు. ఓపిక, దయ చాలా తక్కువ. నిజానికి ప్రియమైన వారిని ప్రపంచంలోనే అత్యంత విలువైన బహుమతిగా చూసుకోవాలి. వారి తప్పులను క్షమించే గుణం కలిగి ఉండాలి. ఎప్పటికీ వేచి చూసేందుకు సిద్ధంగా ఉండాలి. కానీ ఇప్పుడు ఓర్పు అనేది సౌకర్యంతో కప్పిపడేసే పరిస్థితి వచ్చింది. ఇద్దరిలో ఒకరు ఎన్నిసార్లు క్షమించినా.. ఎదుటి వ్యక్తి అదే తప్పు చేస్తూనే ఉంటారు. క్షమాగుణాన్ని అలసత్వంగా తీసుకుని.. అవహేళన చేస్తున్నారు.

భరించలేని పరిస్థితి తీసుకొస్తున్నారు.

Next Story

Most Viewed