- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తేనెటీగలకు వైరస్.. ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం
దిశ, ఫీచర్స్: తేనెటీగలు ప్రాణాంతక వైరస్ వ్యాప్తితో బాధపడుతున్నాయి. 'వర్రోవా డిస్ట్రక్టర్' అనే పరాన్నజీవి ద్వారా వ్యాప్తి చెందుతున్న డీఫార్మ్‌డ్ వింగ్ వైరస్(DWV).. తేనెటీగల కణజాలాలను కూడా తినేస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. 40 ఏళ్ల క్రితమే ఈ వైరస్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. 2001లో నెదర్లాండ్స్‌లో ఉద్భవించిన వైరస్ మ్యుటేషన్ ప్రస్తుతం ఐరోపాలో పూర్తిగా వ్యాపించిందని వెల్లడించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తేనెటీగలకు ముప్పు వాటిల్లనుందని హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్‌తో ఆస్ట్రేలియా తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో తేనెటీగలు తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
వైరస్ తేనెటీగలను ఎలా ప్రభావితం చేస్తుంది?
DWV-B వేరియంట్స్‌కు సంబంధించి అత్యంత స్పష్టమైన లక్షణం 'కుంచించుకుపోయే రెక్కలు DWV-A (ఒరిజినల్ స్ట్రెయిన్)'. కానీ వైరస్ లోపలి నుంచి తేనెటీగలపై దాడి చేస్తుంది. పొట్టిగా, గుండ్రంగా ఉండే పొత్తికడుపు, పక్షవాతానికి గురైన కాళ్లు ఈ వైరస్ సంకేతాలు కాగా.. దాడి తర్వాత 48 గంటల కంటే తక్కువ సమయంలోనే తేనెటీగలు చనిపోతున్నాయి. ఇక ఈ వైరస్ లక్షణాలు కలిగిన తేనెటీగలు తమ జాతి నుంచి బహిష్కరించబడతాయి.
కాగా ఈ వైరస్ నుంచి తేనెటీగలను రక్షించేందుకు పరిశుభ్రతపై శ్రద్ధ చూపాలని నిపుణులు సూచిస్తున్నారు. తద్వారా సదరు తేనెటీగల కాలనీ మాత్రమే కాకుండా అడవి తేనెటీగలను కూడా రక్షించుకోగలమని చెప్తున్నారు.