Dating culture : నాట్ ఇంట్రెస్టెడ్.. డేటింగ్‌పై యువతలో తగ్గుతున్న ఆసక్తి.. కారణాలివే!

by Javid Pasha |   ( Updated:2024-08-28 11:42:55.0  )
Dating culture : నాట్ ఇంట్రెస్టెడ్.. డేటింగ్‌పై యువతలో తగ్గుతున్న ఆసక్తి.. కారణాలివే!
X

దిశ, ఫీచర్స్ : నచ్చిన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో ఒకప్పుడు పెద్దల ప్రమేయం ఎక్కువగా ఉండేది. కానీ డేటింగ్ కల్చర్‌‌లో అలాంటిది తప్పనిసరేం కాదు. పార్ట్‌నర్ ఎంపిక విషయంలో తల్లిదండ్రులు, పెద్దలు కూడా యువత ఇష్టానికే వదిలేస్తున్నారు. యూత్ కూడా సొంత ఆలోచనలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తోంది. వివిధ డేటింగ్ యాప్‌లలో, ఆన్‌లైన్ సైట్లలో నమోదు చేసుకోవడం ద్వారా భాగస్వామిని సెలెక్ట్ చేసుకుంటోంది. అయితే ఇన్నాళ్లు ఈ డేటింగ్ కల్చర్‌పై ఎక్కువగా మొగ్గు చూపిన యువత.. ప్రస్తుతం దానిపట్ల ఆసక్తి కోల్పోతోందని ప్యూ రీసెర్చ్ సర్వే ఇటీవల పేర్కొన్నది. అందుకు గల కారణాలేమిటో చూద్దాం.

యువతలో డేటింగ్ పట్ల ఆసక్తి తగ్గడానికి కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఎన్నో ఆశలతో, ఊహలతో డేటింగ్ ప్రారంభిస్తే చివరకు ఏదో ఒక విషయంలో నిరాశకు గురికావాల్సిన పరిస్థితులు నేడు అధికంగా ఉంటున్నాయి. అట్లనే తాము కోరుకున్న మంచి పార్ట్‌నర్ కోసం ఎంత వెతికినా ప్రయత్నాలు సఫలం కాకపోవడం కూడా చివరకు డేటింగ్ కల్చర్ మీద విముఖతకు దారితీస్తోందని నిపుణులు చెప్తున్నారు.

‘ఘోస్టింగ్’ బిహేవియర్ పెరగడం

డేటింగ్ పీరియడ్‌లో మాత్రమే మంచి బిహేవియర్ కలిగి ఉండి.. ఆ తర్వాత భాగస్వామిపై ఇంట్రెస్ట్ చూపకపోవడం, ఎమోషనల్ సపోర్ట్ అందించకపోవడం, వేధించడం వంటి పరిస్థితులు డేటింగ్ కల్చర్‌లో ఇటీవల పెరుగుతున్నాయి. ఇది గమనిస్తున్న యువత కూడా దాని పట్ల ఆసక్తి చూపడం లేదు. మరో ముఖ్యమైన కారణం ఏంటంటే.. డేటింగ్ చేసినన్ని రోజులు బాగానే ఉండి. ఆ తర్వాత సడెన్‌గా అవతలి వ్యక్తిని దూరం పెట్టడం, కమ్యూనికేషన్ ఆపివేయడం వంటివి తరచుగా జరుగుతున్నాయి. దీనినే ‘ఘోస్టింగ్’ పద్ధతిగా డేటింగ్ కల్చర్ విశ్లేషకులు అభివర్ణిస్తు్న్నారు. యువతలో అనాసక్తి కలగడానికి ఇది కూడా ప్రధాన కారణం.

పెరుగుతున్న సమస్యలు

ప్యూ రీసెర్చ్ సెంటర్ స్టడీ ప్రకారం.. గత పదేండ్లుగా ప్రపంచ వ్యాప్తంగా డేటింగ్ కల్చర్‌పై యువతలో ఇంట్రెస్ట్ తగ్గుతూ వస్తోంది. 18 ఏండ్లు పైబడిన అమెరికనల్లో అయితే దాదాపు సగం మంది ఇప్పుడు డేటింగ్ క్లిష్టతరంగా మారిందని భావిస్తున్నారట. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు డేటింగ్ ప్లాట్‌ఫామ్స్ వినియోగం పెరగడం, ప్రైవసీ లేకపోవడం, డేటింగ్ స్వభావం మారడం, స్వార్థం పెరగడం, శారీరక, మానసిక సమస్యలు, సామాజిక అంచనాల్లో మార్పులు, నైతిక విలువలు, లింగ వివక్ష వంటివి ఈ పదేండ్ల కాలంలో పెరగడం యువతలో అసంతృప్తికి, అనాసక్తికి కారణం అవుతోంది.

యాప్‌ల వినియోగంలోనూ తగ్గుదల

యువతలో ఆసక్తి తగ్గిన కారణంగా డేటింగ్ యాప్‌ల వినియోగం కూడా తగ్గిపోయిందని నిపుణులు చెప్తున్నారు. అందుకు చక్కటి ఉదాహరణ 2014తో పోలిస్తే టిండర్ వార్షిక డౌన్‌లోడ్స్ ఇప్పుడు మూడోవంతుకు పడిపోయాయి. బంబుల్ కూడా వినియోగదారుల ఆసక్తి మారుతోందని పేర్కొన్నది. అమెరికాలోని ప్రతీ ముగ్గురు బంబుల్ డేటింగ్ యాప్ వినియోగదారుల్లో ఒకరు ‘స్లో డేటింగ్’ చేస్తున్నట్లు సర్వేలో తేలింది. యూత్ రీసెర్చ్ ఏజెన్సీ సావంట ప్రకారం కూడా 90 శాతంకంటే ఎక్కువమంది జనరేషన్ జెడ్ పర్సన్స్ డేటింగ్ యాప్‌లతో విసిగిపోయి ఉన్నారు.

సోషల్ మీడియాలో ‘క్విక్ ఫిక్స్’

యువతలో ఆసక్తి తగ్గుతున్న క్రమంలో డేటింగ్ సైట్లు, యాప్‌ల తరపున కొందరు సోషల్ మీడియాలో తరచుగా ప్రచారం చేయడం కూడా ఇటీవల పెరుగుతోంది. ముఖ్యంగా ఇన్‌ఫ్లూయెన్సర్స్ యవతను డేటింగ్ కల్చర్ వైపు ప్రోత్సహించడానికి ‘క్విక్ ఫిక్స్’ మెథడ్‌ యూజ్ చేస్తున్నారని నిపుణులు చెప్తున్నారు. అంటే తక్షణ సమస్యకు, తక్షణ పరిస్కారాన్ని కనుగొనడం ఈ పద్ధతిలో భాగం. అయినప్పటికీ ఇది కూడా యువతను ఆకట్టుకోలేకపోతోంది. ‘మీ జీవితాన్ని మార్చే డేటింగ్ రూల్స్, కొనసాగడానికి మూడు రహస్యాలు’ అంటూ ఏదో ఒకటి ఊదరగొడితే నమ్మే పరిస్థితిలో ఈతరం లేదిప్పుడు. నిజంగా డేటింగ్ పట్ల ఆసక్తి మునుపటిలా పెరగాలంటే సంబంధాలపట్ల నమ్మకాన్ని పెంపొందించే వాతావరణం ఏర్పడాలని నిపుణులు పేర్కొంటున్నారు. పరస్పర అవగాహన, ప్రేమ, ఆప్యాయత, నిజాయితీ వంటివి ఉండాలని, డేటింగ్ యాప్‌లలో, సైట్లలో తప్పుడు ప్రొఫైల్ క్రియేట్ చేసేవారిని గుర్తించే ఆల్గారిథమ్‌లు అందుబాటులోకి రావాలని సైకో థెరపిస్టులు పేర్కొంటున్నారు.

More News : MISS YOU : మీ లవర్ మిమ్మల్ని మిస్ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ టిప్స్ ఫాలో అవండి..

Advertisement

Next Story

Most Viewed