- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కనురెప్పలపై చుండ్రు.. నిర్లక్ష్యం చేస్తే అంతే..!!
దిశ, ఫీచర్స్: చలికాంలో చాలామందికి చుండ్రు సమస్య ఏర్పడుతుంది. తలపై ఉండే చల్లదనానికి బ్యాక్టీరియా రూపంలో ఎక్కువగా పేరుకుపోతుంది. చాలామందికి చుండ్రు అంటే తలపై మాత్రమే వస్తుందని తెలుసు. కానీ, ఇది కనురెప్పలకు కూడా వస్తుంది. కళ్ల మీద ఉండే సన్నని రెప్పల మధ్యలో కూడా చుండ్రు వస్తుంది. శీతాకాలంలో లేదా సీజన్ మార్పుల కారణంగా ఇది ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా రెప్పలపై అధికంగా చుండ్రు పేరుకుపోతే ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
ఈ సమస్యలు :
కనురెప్పలపై బ్యాక్టీరియా ఎక్కువగా చేరిపోవడం వల్ల చుండ్రు ఏర్పడుతుంది. ఇది చర్మ గ్రంధులను మూసుకుపోయేలా చేస్తుంది. ఇది ఎక్కువగా శరీరం నుంచి నూనె ఉత్పత్తి అయినప్పుడు లేదంటే ఆ ప్రాంతంలో శిలీంధ్రాలు పెరిగినప్పుడు ఈ చుండ్రు వస్తుంది. కనురెప్పలపై చుండ్రు బయటికి కనిపించకపోయినా.. దీని కారణంగా కళ్లు ఎర్రగా మారడం, కళ్లలో మంట, కళ్లలో నీళ్లు, కాంతిని చూడలేకపోవడం వంటివి చుండ్రు ఉందని తెలుపుతాయి. చాలామందికి ఈ విషయం తెలియక దీనిని నిర్లక్ష్యం చేస్తుంటారు.
ఈ చిన్న చిన్న సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే కంటి సమస్యలకు కారణం అవుతుంది. కంటిలో ఉన్న కార్నియా దెబ్బతినేలా చేస్తుంది. అంతేకాదు దీనిని ఇలాగే వదిలేస్తే కండ్లకలక, కార్నియా వాపు వంటి దీర్ఘకాలిక కంటి ఇన్‌ఫెక్షన్ల ప్రమాదాన్ని కలిస్తుంది. చాలామంది కళ్లలో దురద వచ్చినప్పుడు వాటిని ఎక్కువగా రుద్దడం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కార్నియా బలహీనపడుతుంది. ఇది కంటి సంబంధిత సమస్యలకు కారణం కావొచ్చు. దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
ఇలా చేయండి:
కాంటాక్ లెన్స్ వాడుతున్న వారు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే లెన్స్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా పేరుకుపోయి ఇన్‌ఫెక్షన్‌ను కలిగిస్తుంది. అందుకే ప్రతీ రోజూ సున్నితమైన క్లెన్సర్‌తో కనురెప్పలను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. నిద్రపోయే ముందు కళ్ళను శుభ్రం చేసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల కనురెప్పలపై చుండ్రు పేరుకుపోయే చాన్స్ ఉండదు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు.