- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Coconut water : వర్షాకాలంలో షుగర్ పేషెంట్లు కోకోనట్ వాటర్ తాగొచ్చా?
దిశ, ఫీచర్స్: Coconut water : వర్షాకాలంలో షుగర్ పేషెంట్లు కోకోనట్ వాటర్ తాగొచ్చా?ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎండాకాలంలో వీటికి డిమాండ్ ఎక్కువ అయినప్పటికీ ఇప్పుడు అన్ని సీజన్లలో కోకోనట్ వాటర్ లభిస్తాయి. అయితే వర్షాకాలంలో షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగవచ్చా? అనే సందేహాలను పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. నిపుణులు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దాం.
లో షుగర్ లెవల్స్‌కి మూలం!
కొబ్బరి నీళ్లు నిజానికి ప్రకృతి ఇచ్చిన వరంగా పేర్కొంటారు పలువురు. ఈ నేచురల్ రిఫ్రెష్ డ్రింక్‌లో శరీరానికి తక్షణ శక్తినిచ్చే పోషకాలు ఉంటాయని, ముఖ్యంగా చక్కెరస్థాయిలు తక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు. 200 మి.లీ కొబ్బరి నీళ్లలో 40 నుంచి 50 కేలరీలు, అలాగే 10 గ్రాముల పిండి పదార్థాలు ఉంటాయట. దీనివల్ల ఇవి జీర్ణక్రియకు మేలు చేస్తాయి. కాబట్టి తరచుగా తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే వర్షకాలంలో కూడా తాగొచ్చని, షుగర్ పేషెంట్లు కూడా కొబ్బరి నీళ్లను ఒక మోతాదు వరకు తాగవచ్చని వైద్య నిపుణులు చెప్తున్నారు.
బరువు తగ్గడంలోనూ హెల్ప్
కోకోనట్ వాటర్‌లో తక్కువ కేలరీలు ఉంటాయి. కాబట్టి అవి బరువు పెరిగే పరిస్థితిని అడ్డుకుంటాయి. అలాగే వీటిలో బయోయాక్టివ్ ఎంజైమ్స్ ఉండటం మూలంగా జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తాయి. డైలీ రెండుమూడుసార్లు కొబ్బరి నీళ్లు తాగుతూ ఉంటే సహజంగానే అధిక బరువు తగ్గుతారని నిపుణులు పేర్కొంటున్నారు. వీటిలో పొటాషియం, హైడ్రేట్లు ఎక్కువగా ఉండటంవల్ల శక్తని ఇవ్వడంతోపాటు శరీరాన్ని డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తాయి.
మధుమేహం ఉంటే తాగొచ్చా?
సాధారణ వ్యక్తుల మాదిరిగానే షుగర్ పేషెంట్లు కూడా కోకోనట్ వాటర్ తాగవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. అయితే తరచుగా రక్తంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉండకపోవడం వంటి సమస్యను ఎదుర్కొనే వారు మాత్రం కాస్త పరిమితంగా తాగాలి. వీరు రోజుకు 200 మి.లీ వరకు మాత్రమే తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. పాఠకుల అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. ఆరోగ్యపరమైన నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.