బొద్దింకల వైర్‌లెస్‌ కంట్రోలింగ్.. ఎలక్ట్రానిక్స్‌తో బాడీ పార్ట్స్ కనెక్షన్

by Hajipasha |   ( Updated:2022-09-07 13:11:26.0  )
బొద్దింకల వైర్‌లెస్‌ కంట్రోలింగ్.. ఎలక్ట్రానిక్స్‌తో బాడీ పార్ట్స్ కనెక్షన్
X

దిశ, ఫీచర్స్: రికెన్ క్లస్టర్ ఫర్ పయనీరింగ్ రీసెర్చ్ పరిశోధకులు రిమోట్ కంట్రోల్‌తో ఆపరేట్ చేయగల సైబోర్గ్ బొద్దింకలను సృష్టించారు. ఇవి ప్రమాదకర వాతావరణాల పరిశీలన, పర్యవేక్షణకు మానవాళికి సాయపడతాయని వెల్లడించారు. ఇక్కడ సైబోర్గ్ అంటే పార్ట్ లివింగ్, పార్ట్ సింథటిక్ జీవి. ఇది సగం కీటకం, సగం యంత్రాన్ని తలపిస్తుండగా.. ఈ మొత్తం వ్యవస్థ కీటకాల సహజ నాడీ వ్యవస్థలోకి వైర్ చేయబడింది.

మానవులు, ఇతరత్రా పెద్ద జంతువుల వలె కాకుండా బొద్దింకలు పరిమాణంలో చాలా చిన్నవి. కాబట్టి ఆర్గానిక్, సింథటిక్ భాగాల ఏకీకరణను అనుమతించడానికి పరిశోధకులు పరికరాలను అల్ట్రాథిన్ ఆర్గానిక్ సోలార్ సెల్ మాడ్యూల్స్‌తో పాటు బ్యాక్‌ప్యాక్ లాంటి నిర్మాణంలో చేర్చారు. సహజమైన కదలికలను ప్రభావితం చేయకుండా బొద్దింక వెనుక భాగంలో ఎక్కువ సమయం పాటు చెక్కుచెదరకుండా ఉండేలా ఈ బ్యాక్‌ప్యాక్‌ను సెట్ చేశారు. పరిశోధకులు ముందుగా మడగాస్కర్ బొద్దింకలపై ప్రయోగాన్ని పరీక్షించారు.

ఇది పొత్తికడుపు వెనుక భాగంలో అమర్చబడిన అత్యంత సన్నని 0.004-మిల్లీమీటర్ల మందపాటి ఆర్గానిక్ సెల్ మాడ్యూల్‌తో 2.4 అంగుళాల పొడవును పొందవచ్చు. అయితే ఉదరం.. ఆకారాన్ని మారుస్తుందని, ఎక్సోస్కెలిటన్ భాగాలు అతివ్యాప్తి చెందుతాయని వారు తర్వాత పరిశీలించారు. దీనికి పరిష్కారంగానే ఫిల్మ్‌లపై అంటుకునే, అంటుకోని విభాగాలను ఒకదానితో ఒకటి కలిపారు. ఇది వాటిని వంగడానికి, చెక్కుచెదరకుండా ఉండటానికి అనుమతిస్తుంది.

మందపాటి సౌర ఘటం ఫిల్మ్స్ పరీక్షలో బొద్దింకల కదలికలో ఇబ్బంది వల్ల అదే దూరం పరుగెత్తడానికి రెండు రెట్లు ఎక్కువ సమయం పట్టిందని తేలింది. కాలు భాగాలను ఉత్తేజపరిచే వైర్స్‌తో బొద్దింకల భాగాలను ఏకీకృతం చేసిన తర్వాత, సైబోర్గ్‌లను 30 నిమిషాల పాటు సూడో-సూర్యకాంతి కింద పరీక్షించారు. అక్కడ అవి వైర్‌లెస్ రిమోట్ కంట్రోల్‌ ఉపయోగించి ఎడమ, కుడివైపు కదిలాయి.

వావ్.. టెక్నాలజీతో గణేషుని నిమజ్జనం.. ఆకట్టుకుంటున్న వీడియో

Advertisement

Next Story

Most Viewed