Cloths: బట్టలపై XL , XXL అంటూ ఉంటాయి కదా.. మరి X అంటే ఏమిటో మీకు తెలుసా?

by Kavitha |
Cloths: బట్టలపై XL , XXL అంటూ ఉంటాయి కదా.. మరి X అంటే ఏమిటో మీకు తెలుసా?
X

దిశ, ఫీచర్స్: బేసిక్‌గా మనం షాపింగ్ మాల్స్, చిన్న చిన్న షాపులకి వెళ్లినప్పుడు డ్రెస్‌లు తీసుకుంటూ ఉంటాము. అయితే వారు ఏ సైజు కావాలి మేడం, సార్ అని అడుగుతూ ఉంటారు. అప్పుడు మనం XS, S, M, L, XL, XXL, XXXL అంటూ చెప్పి తీసుకుంటాము. అయితే బట్టలపై ఉండే XL లో X అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం..

ఇక్కడ 'X' అంటే ఎక్స్‌ట్రా అని మీనింగ్. XL అంటే ఎక్స్‌ట్రా లార్జ్ , XXL అంటే ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా లార్జ్ అని అర్ధం. అదేవిధంగా పరిమాణం చిన్న పరిమాణం కంటే తక్కువగా ఉంటే, అది ఎక్స్‌ట్రా స్మాల్ XSగా సూచించబడుతుంది. అయితే మగవారు తీసుకునే చొక్కాల విషయంలో XL సైజు అంటే 42 - 44 అంగుళాల మధ్య ఉండే సైజ్ అని. అదేవిధంగా షర్టులు లేదా డ్రెస్ విషయంలో XXL అంటే 44 - 46 అంగుళాల మధ్య ఉండే సైజ్ అని అర్థం.


Advertisement

Next Story

Most Viewed