ధనవంతులను ఎలా లైన్‌లో పెట్టాలి.. స్పెషల్ కోర్సుతో వందల కోట్లు సంపాదిస్తున్న మహిళ

by Sujitha Rachapalli |   ( Updated:2024-07-22 15:27:05.0  )
ధనవంతులను ఎలా లైన్‌లో పెట్టాలి.. స్పెషల్ కోర్సుతో వందల కోట్లు సంపాదిస్తున్న మహిళ
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా పేరుతోపాటు డబ్బులు కూడా సంపాదించేలా చేస్తుంది. అటు గుర్తింపుతోపాటు ఇటు మనీ, మజా రెండింటిని అందిస్తుంది. పైగా ఇష్టమైన పనులు చేసుకుంటూ వీడియోలు చేయబడమే కాబట్టి లైఫ్ శాటిస్ఫాక్షన్‌తో సాగిపోతుంది. అయితే చాలా మంది సింగింగ్, డ్యాన్సింగ్, స్కిట్స్, డైలీ ఇంట్లో జరిగే పనులు లేదంటే ఆఫీసులో వీడియోలు, హెల్త్ టిప్స్.. ఇలా ఎవరికి నచ్చింది వారు షేర్ చేస్తుంటారు. కానీ ఓ చైనీస్ ఇన్‌ఫ్లుయెన్సర్ మాత్రం కొత్తగా ఆలోచించింది. ధనవంతులను ఎలా పెళ్లి చేసుకోవాలనే సలహాలిస్తూ ఏకంగా రూ. 163 కోట్లు సంపాదించింది.

సాధారణంగా అమ్మాయిలు రిచ్ పర్సన్‌ను పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడుతారు. ఈ ఆలోచనను క్యాష్ చేసుకుంది QU QU అనే మహిళ. చైనీస్ మీడియా ప్రకారం కన్సల్టేషన్ ఫీజు రూ. 13వేలు కాగా కోర్సు కూడా కావాలి అనుకుంటే రూ. 43వేలు చెల్లించాల్సి ఉంటుంది.మొత్తానికి ఈ ప్లాన్ బాగా వర్కవుట్ కాగా కొద్ది కాలంలోనే వందల కోట్లు కూడబెట్టగలిగింది.

Read more...

HEALTHY FOODS ఈ ఆహారాలను వండిన మరుసటి రోజు తింటే ఆ రుచే వెరబ్బా.. పైగా!

Advertisement

Next Story