- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Children's day: చిల్డ్రన్స్ డే స్పెషల్.. మీ చిన్నారులకు విషెస్ చెప్పేయండిలా!
దిశ, ఫీచర్స్: మన దేశంలో ప్రతీ సంవత్సరం నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవంను జరుకుంటాము. చాలా దేశాలలో ఈ చిల్డ్రన్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొట్టమొదటి ప్రధానిగా పనిచేశారు జవహర్ లాల్ నెహ్రూ. ఆయన జన్మించిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ చిల్డ్రన్స్ డే రోజున పిల్లలకు ఉన్న హక్కులు, బాల్యంపై అవగాహన కల్పిస్తుంటారు. అయితే, భావి తరాలకు పిల్లలు ఎంత ముఖ్యమో చెప్పే చిల్డ్రన్స్ డే రోజు, పిల్లలకు ఎలా విషెష్ చెప్పాలో ఇక్కడ చదివేయండి.
చిల్డ్రన్స్ డే కొటేషన్స్: చిల్డ్రన్స్ డే రోజు పిల్లలను మోటివేట్ చేసేలా క్రియేటివ్‌గా ఇలా విష్ చేయండి.
*నేటి బాలలలే రేపటి పౌరులు. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
* మీ బాల్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను. హ్యాపీ చిల్డ్రన్స్ డే.
* చిన్నతనాన్ని దూరం చేసే టెక్నాలజీకి మరింత దగ్గరకావొద్దని కోరుకుంటూ.. సంతోషం, ప్రేమ మీకు దక్కాలని.. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
* కొత్త విషయాలను నేర్చుకుంటూ, నేర్చుకున్న అంశాలను ఎప్పటికప్పుడు మీకు గుర్తిండి పోయేలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని కోరుకుంటూ బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
* స్వచ్ఛమైన మీ చిరునవ్వు, కల్మషం లేని ప్రేమ ఎప్పటికీ ఇలా స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటూ.. హ్యాపీ చిల్డ్రన్స్ డే.
* మీరే ఈ ప్రపంచానికి భవిష్యత్తు.. మీరే ఈ లోకానికి వెలుగునివ్వాలని కోరుకుంటున్నాను. బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
* మా జీవితాల్లో అమాయకపు చిరునవ్వుతో, కల్మషం లేని ప్రేమ, ఆనందాన్ని అందిస్తున్న పిల్లలకు హ్యాపీ చిల్డ్రన్స్ డే.
* మీ జీవితంలో ప్రతీ క్షణం రంగులమయం కావాలని కోరుకుంటూ..బాలల దినోత్సవ శుభాకాంక్షలు.
* మీలగే మీ ప్రతీ ఒక్క రోజు నవ్వులు, సంతోషాలతో ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ చిల్డ్రన్స్ డే.