పిల్లలు కూరగాయలు తినడం లేదా?.. అయితే ఇలా చేయండి..

by sudharani |   ( Updated:2023-05-01 16:12:25.0  )
పిల్లలు కూరగాయలు తినడం లేదా?.. అయితే ఇలా చేయండి..
X

దిశ, ఫీచర్స్: మీ పిల్లలు అన్నం, కూరగాయలు తినేందుకు ఆసక్తి చూపడం లేదా? అయితే బలవంతం చేయకండి. వారు ఏం తినాలని మీరు కోరుకుంటారో, కలిసి భోజనం చేసేటప్పుడు అవి మీరు తింటూ ఉండండి. దీంతో పిల్లలు కూడా మిమ్మల్ని చూసి తినడం నేర్చుకుంటారని నిపుణులు చెప్తున్నారు. చిన్నారుల ఆహారపు అలవాట్లను తెలుసుకునేందుకు ఆరు ఏళ్ల కంటే తక్కువ ఏజ్‌గల పిల్లలున్న 2 వేల మంది పేరెంట్స్‌ను స్టాక్ కే తరఫున వన్‌పోల్ అనే సంస్థ సర్వే చేసింది. ఈ సందర్భంగా 53 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ప్రత్యేకంగా అన్‌వాంటెడ్ వెజిబేటుల్స్ తినడాన్ని గమనించినట్లు సర్వే నిపుణులు చెప్పారు.

మొత్తం మీద 78 శాతం మంది పిల్లలు టేబుల్ వద్ద పేరెంట్స్‌ను అనుకరించడం ద్వారా ఇంతకు ముందు నచ్చకుండా ఉన్న కూరగాయలు, ఇతర ఆహారాలను తినడం నేర్చుకున్నారని తేలింది. సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది తమ బిడ్డ భోజన సమయంలో తమలాగే ఒకే టేబుల్‌పై కూర్చోవడం ముఖ్యమని, 80 శాతం మంది తమ పిల్లలతో కలిసి తినడం చాలా ఇష్టమని, ఇది చక్కటి అనుబంధానికి మరింత మేలు చేస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

డిప్రెషన్‌కు చెక్ పెడుతున్న ఫిజికల్ యాక్టివిటీస్.. అధ్యయనంలో వెల్లడి

Advertisement

Next Story

Most Viewed