- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చియాసీడ్స్ ఇంత నిష్పత్తిలో తీసుకోకపోతే అంతే సంగతి..!!
దిశ, ఫీచర్స్: చియా సీడ్స్ ప్రయోజనాల గురించి తెలిసిందే. చాలా మంది వీటిని డైట్‌లో చేర్చుకుంటారు. ప్రస్తుత రోజుల్లో బరువు ఒక సమస్యగా మారిపోయింది. బరువు తగ్గడానికి ఎంతో మంది చీయా సీడ్స్‌ను తమ డైట్‌లో భాగం చేసుకుంటున్నారు. కేవలం వెయిట్ లాస్‌కే కాకుండా గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ లో ఉంచడం, ఎముకలను బలంగా తయారుచేయడం, ఎలర్జీలు దూరం చేయడం, చర్మం కాంతిని మెరుగుపరచడం, వృద్ధాప్య ప్రారంభ సంకేతాలను నివారించడం ఇలా చియా సీడ్స్‌తో ఎన్నో ఉపయోగాలున్నాయి.
ఈ గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, ఫైబర్, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, సెలీనియం, ఫాస్పరస్, కాపర్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వ్యక్తిని ఫిట్‌నెస్‌గా ఉంచడంలో ఎంతో సహాయపడుతాయి. మానవ శరీరంలోని మంచి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. చీయా సీడ్స్‌తో ఎన్నో లాభాలున్నప్పటికీ వీటిలో ఉండే ఫైబర్ కొంతమందికి ఎన్నో రకాల సమస్యలను తీసుకొచ్చి పెడుతుంది. ఈ గింజలను వాటర్‌లో నానబెట్టినప్పుడు ఏర్పడే జెల్ అవసరమైన పోషకాలను విచ్ఛిన్నం చేస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
అయితే చియా సీడ్స్‌ను ఎప్పుడూ కూడా 1.3 నిష్పత్తిలో వాటర్‌లో లేదా పాలల్లో నానబెట్టాలి. 1 భాగం చియా సీడ్స్.. 3 భాగాలు వాటర్ అయినా పాలైనా తీసుకోవాలి. ఈ నిష్పత్తి కంటే ఎక్కువ నీళ్లు తీసుకున్నట్లైతే పలు అనారోగ్య సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే వీటిని 15 నిమిషాల కంటే ఎక్కువ సేపు నానబెట్టకూడరు. కొంతమంది ఈ గింజలను వేయించి.. పెరుగు, వోట్‌మీల్, సలాడ్‌పై వేసుకుని తింటారు. ఇలా తిన్నాక అధిక మొత్తంలో వాటర్ తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.