- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అపరిమితమైన సెక్స్ కోసం చియా సీడ్స్..
దిశ, ఫీచర్స్ : మీరు లవబుల్ సెక్సువల్ లైఫ్‌ను ఎంజాయ్ చేయడానికి సహజమైన మార్గం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే చియా సీడ్స్‌ను మీ డైట్‌లో భాగం చేసుకోవాల్సిందే. ఎందుకంటే వీటిలో లైంగిక కోరికలు, సామర్థ్యాన్ని పెంచే అద్భుతమైన పోషకాలు ఉన్నాయి. లిబిడో అండ్ సెక్సువల్ హెల్త్‌కు సీక్రెట్ వెపన్‌గా పనిచేస్తాయి. అందుకే ప్రస్తుతం వీటిని ట్రెండీ సూపర్‌ఫుడ్‌గా పేర్కొంటున్నారు ఆహార నిపుణులు. ఏడాది పొడవునా ఉండే సాల్వియా హిస్పానికా ఎల్ (Salvia Hispanica L)నుంచి వచ్చిన చియా విత్తనాలు గొప్ప పోషక, ఔషధ విలువల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో వాటి వినియోగం బాగా పెరిగింది.
మొదట ఎక్కడ పెరిగాయి?
వీటిని కనుగొనడం, ఉపయోగించడంపై ‘మాసా కనేజ్ హెర్నిక్, దరిజా కోర్ అండ్ జెల్కో కనేజ్’ అనే రష్యన్ పరిశోధన కథనాలు మాలిక్యూల్ జర్నల్‌లో పబ్లిష్ అయ్యాయి. వీటి ప్రకారం చియా సీడ్ మెసొపొటేమియా వ్యవసాయ సంస్కృతుల ద్వారా ప్రపంచానికి వ్యాపించాయి. ఆ తర్వాత కనబడుకుండా పోయిన చియా సీడ్స్‌ను 20వ శతాబ్దం మధ్యకాలంలో సైంటిస్టులు తిరిగి కనుగొన్నారు.
న్యూట్రిషనల్ వాల్యూస్
మాలిక్యూల్ జర్నల్ ప్రకారం చియా సీడ్స్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, బహుళ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, డైటరీ ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలను కూడా కలిగి ఉంటాయి. ఇవేగాక పాలీఫెనాల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. కెఫిక్ యాసిడ్, రోస్మరినిక్ యాసిడ్, మైరిసెటిన్, క్వెర్సెటిన్ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. కెఫిక్ యాసిడ్ అనేది ఒక యాంటీ యాక్సిడెంట్. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చియా సీడ్ ఆయిల్ నేడు మార్కెట్లో అత్యంత విలువైన నూనెలలో ఒకటి. మరో ముఖ్య విషయం ఏంటంటే చియా సీడ్స్‌లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ లైంగిక కోరికను పెంచుతాయట.
సెక్సువల్ డిజైర్ పెరుగుదల
ది జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం.. చియా సీడ్స్ సరైన మొత్తంలో తీసుకుంటే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పురుషులలో లైంగిక కోరికల్ని పెంచుతాయి. ఈ సీడ్స్ బాడీ ప్రొడ్యూస్ చేయలేని ఒమేగా-3 వంటి ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి సహజంగానే టెస్టోస్టెరాన్ పెరుగుదలకు దోహదపడతాయి. టెస్టోస్టెరాన్ లైంగిక పరమైన శక్తి, భావాలను ప్రేరేపిస్తుంది. దీని కారణంగా ఎక్కువసేపు సెక్స్‌లో పాల్గొన్నా అలసట ఉండదు.
రీ ప్రొడెక్టివ్ హెల్త్ ఫర్ ఫిమేల్స్
ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ జర్నల్‌లో చియా సీడ్స్ గురించి పబ్లిషైన పరిశోధనా కథనాల ప్రకారం.. ఇవి మహిళల్లో రీప్రొడక్టివ్ హెల్త్‌కు సహాయపడతాయి. పరిశోధకులు రెహమాన్ ఉల్లా అండ్ M. నదీమ్ ప్రకారం.. ఈ సీడ్స్‌లో హై లెవల్ ఫ్యాటీ ఆయిల్స్, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు ఉంటాయి. ఈ పోషకాలన్నీ పిల్లల మెదడు అభివృద్ధిలో సహాయపడతాయి.
తల్లి పాల ఉత్పత్తికి
ఇవి సహజంగా తల్లిపాల ఉత్పత్తి రేటును పెంచడంలో కూడా సహాయపడతాయి. అందుకే ఉప్పు, మిరియాలు వంటి రోజువారీ మసాలా దినుసుల్లాగా చిటికెడు చియా గింజలను కూడా ఆహారంలో చేర్చాలి. దీనివల్ల రోజంతా శరీరం శక్తివంతంగా ఉంటుంది.
సంతానోత్పత్తిని పెంచడంలో
జర్నల్ ఆఫ్ సెక్సువల్ మెడిసిన్ ప్రకారం చియా సీడ్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, ఖనిజాలు, ఇనుము, మెగ్నీషియం, జింక్ ఉంటాయి. ఇవి గర్భధారణకు ఉపయోగపడతాయి. ఇవి మహిళల్లో అండాశయంలో హెల్తీ ఎగ్స్, అండ్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడ్యూస్ చేయడంలో సహాయపడతాయి. అలాగే హార్మోన్లను సమతుల్యం చేస్తాయి. రీ ప్రొడక్టివ్ ఆర్గాన్స్‌కు బ్లడ్ సర్క్యూట్‌ని పెంచుతాయి.
గ్లుటెన్ రహిత ప్రోటీన్
జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం.. చియా సీడ్స్ డైటరీ ఫైబర్‌ను కలిగి ఉండటంవల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, గ్లూటెన్-ఫ్రీ ప్రోటీన్లు ఫినోలిక్ సమ్మేళనాల ఉనికి కారణంగా డయాబెటిస్‌ను కూడా నియంత్రించవచ్చు. యాంటీ ఇన్ ఫ్ల మేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాల కారణంగా డైస్లిపిడెమియా(dyslipidemia)ను, హై బ్లడ్ ప్రెషర్‌ను నియంత్రించడంలో చియా సీడ్స్ బాగా పనిచేస్తాయి. ఇవి రక్తం గడ్డకట్టడం, యాంటి డిప్రెసెంట్, యాంటి యాంగ్జయిటీ, అనాల్జేసిక్, దృష్టి, రోగనిరోధక శక్తి బూస్టర్‌గా కూడా పనిచేస్తాయి. కాబట్టి చియా సీడ్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
శృంగారంలో భర్త ప్రైవేట్ పార్ట్‌ను కొరకకుండా.. ‘ఫెస్టివల్ ఆఫ్ పెనిస్’