Jaggery Benefits: బెల్లంతో ఈ వ్యాధులకు చెక్.. ఎన్ని మంచి ప్రయోజనాలున్నాయో తెలుసా?

by Manoj |   ( Updated:2022-05-12 07:12:49.0  )
Jaggery Benefits: బెల్లంతో ఈ వ్యాధులకు చెక్.. ఎన్ని మంచి ప్రయోజనాలున్నాయో తెలుసా?
X

Jaggery Benefits

దిశ, వెబ్‌డెస్క్: బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చాలా మందికి తెలియక పోవచ్చు. కానీ బెల్లం(Jaggery)లో అనేక జౌషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. ప్రతీ రోజూ కనీసం ఒక బెల్లం ముక్కను తీసుకుంటే శరీరం మొత్తాన్ని శుభ్రపరుస్తుంది. కడుపులో మంట, ఎసిడిటీ(Acidity) లాంటి సమస్యల దూరం చేస్తుంది. అంతే కాదు బెల్లం ఊపిరితిత్తుల నుండి శ్లేష్మాన్ని తొలగిస్తుంది, దానితో పాటు శరీరం లోపలి నుంచి శ్వాస కోశ, జీర్ణవ్యవస్థలను శుభ్రపరచడంలో సహాయపడుతుంది. చాలా మందికి భోజనం చేశాక చక్కెర లేక బెల్లం తీసుకోవడం అలవాటు. అయితే అది మంచి అలవాటే కానీ చక్కెరకు బెల్లం ప్రత్యామ్నాయం. ఎందుకంటే చక్కెర రక్తంలో గ్లూకోజ్(Glucose) స్థాయిలను పెంచుతుంది. బెల్లం నియంత్రిస్తుంది.

బెల్లం జీర్ణాశయంలో ఎంజైమ్‌ల విడుదలకు దోహదపడుతుంది. తద్వారా జీర్ణ సమస్యలు, మలబద్దక సమస్యలు నయమవుతాయి. బెల్లం మన శరీరంలో ఊబకాయం(Obesity) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పొడి దగ్గు, జలుబు, ఆస్తమా లాంటి సమస్యల నివారణ కోసం తయారు చేసే ఆయుర్యేద మందుల్లో బెల్లాన్ని ఉపయోగిస్తారు. ఒక గ్లాసు వాటర్‌లో బెల్లం, కొన్ని తులసి ఆకులు వేసి మరగనిచ్చి చల్లారనివ్వాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే పొడి దగ్గు తగ్గుతుంది. రోజూ బెల్లం, అల్లం ఈ రెండూ సమాపాలలో కలిపి తీసుకుంటే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. బెల్లంలో ఉండే మెగ్నీషియం వల్ల రక్తనాళాలు, నాడీవ్యవస్థ పటిష్టమవుతాయి. మైగ్రెయిన్ తలనొప్పి బాధిస్తుంటే బెల్లం, నెయ్యి రెండిటినీ కలిపి తీసుకుంటే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మిరియాలపొడి, బెల్లంతో తయారు చేసిన పానకం తాగటం వల్ల ఆకలి కూడా పెరుగుతుంది.

Advertisement

Next Story

Most Viewed