శృంగారంతో ఈ సమస్యలకు చెక్.. ఇది ఔషధం కంటే చాలా పవర్ ఫుల్..

by Sumithra |   ( Updated:2024-04-01 08:49:10.0  )
శృంగారంతో ఈ సమస్యలకు  చెక్.. ఇది ఔషధం కంటే చాలా పవర్ ఫుల్..
X

దిశ, ఫీచర్స్ : సెక్స్ అనేది చాలా లోతైన విషయం. దీన్ని ఎంత ఎక్కువ అధ్యయనం చేస్తే, దాని గురించి మరింత కొత్త, ఆసక్తికరమైన విషయాలు బయటపడతాయి. శృంగారం చేయడం ద్వారా ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయని సెక్సాలజిస్టులు చెబుతుంటారు. అంతే కాదు మనిషి యాక్టివ్ గా ఉండేలా చేస్తుందట. అలాగే కొన్ని అధ్యయనాల్లో మరి కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు నిపుణులు. మరి సెక్స్‌కి సంబంధించిన ఆ ఆసక్తికరమైన ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.

డిప్రెషన్...

శృంగారం చేస్తున్న సమయంలో శరీరంలో సెరోటోనిన్, డోపమైన్ విడుదలవుతాయి. దీని ద్వారా ఎంత డిప్రెషన్ లో ఉన్నవారైనా యాక్టివ్ గా ఉంటారు. అంతే కాదు ఇవి మూడ్ బూస్టర్‌లుగా కూడా బాగా పనిచేస్తాయి.

మైగ్రేన్..

సెక్స్ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్స్ అనే హార్మోన్ సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. ఈ హార్మోన్ లు టాబ్లెట్‌ల కంటే అతి తక్కువ సమయంలో తలనొప్పిని నయం చేస్తుంది.

నిద్రలేమికి..

నిద్రలేమి సమస్యకి శృంగారం సహజ ఔషధంలా పనిచేస్తుంది. రాత్రిపూట రతి చేయడం వల్ల ప్రశాంతమైన నిద్ర వస్తుంది.

హ్యాంగోవర్..

శృంగారం హ్యాంగోవర్ నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. వాస్తవానికి, ఈ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ కారణంగా హ్యాంగోవర్ పోయి ఉపశమనాన్ని అందిస్తుంది. ఆర్థరైటిస్ నొప్పిని తగ్గించడానికి కూడా సెక్స్ మంచి ఎంపిక . ఎందుకంటే ఈ సమయంలో శరీరంలో కార్టిసోన్ విడుదలవుతుంది.

గుండె జబ్బులు..

సెక్స్ గుండెకు చాలా మేలు చేస్తుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వారానికి రెండు సార్లు సెక్స్ చేసే వ్యక్తులు గుండెపోటు నుండి తప్పించుకోవచ్చంటున్నారు నిపుణులు. నిజానికి, సెక్స్ అనేది ఒక వ్యాయామం లాంటిది, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, గుండెను బలపరుస్తుందంటున్నారు.

Read More..

గైనకాలజిస్ట్ దగ్గర దాచకూడని ముఖ్యమైన విషయాలు..

Advertisement

Next Story

Most Viewed