- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alzheimer: అల్జీమర్స్ వ్యాధికి ఈ కూరగాయతో చెక్ పెట్టండి..!
దిశ, వెబ్‌డెస్క్: వయసు పెరిగేకొద్ది ప్రజల్లో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. అందులో అల్జీమర్స్ వ్యాధి ఒకటి. ఇది మెదడులోని కణాలు చనిపోతుండటం వల్ల వచ్చే నాడీ సంబంధిత వ్యాధి. ఇది ఒక రకమైన డిమెన్షియా. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం దెబ్బ తింటాయి. ఈ వ్యాధి సోకిన వారి ప్రవర్తన కూడా మరిపోతుంది. అల్జీమర్స్ వ్యాధికి ప్రత్యేక దశలు కూడా ఉంటాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన సవాళ్లను కలిగి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మీ జీవన శైలిలో పలు మార్పులు చేసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పండ్లు - చేపలు- ఆలివ్ నూనె
అల్జీమర్స్ వ్యాధిని దూరం చేసుకోవాలంటే ముందుగా సమతుల్య ఆహారం తీసుకోవాలి. తాజా కూరగాయలు అధికంగా తీసుకోవాలి. పండ్లు, తృణధాన్యాలు, గింజలు, చేపలు, చికెన్, ఆలివ్ నూనె, గుడ్లు, పాలు వంటివి తీసుకుంటే అల్జీమర్స్ వ్యాధిని ఈజీగా తరిమికొట్టొచ్చు. అలాగే ప్రతిరోజూ ముప్పై నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల కూడా ఈ వ్యాధికి చెక్ పెట్టొచ్చు. అనేక పరిశోధనల్లో ఇది రుజువైందన నిపుణులు చెబుతున్నారు.
కమ్యూనికేషన్ అవసరం..
లిఫ్ట్ యూజ్ చేయకుండా మెట్లు ఎక్కడం, జాగింగ్, రన్నింగ్, వస్తువులు ఎత్తడం వంటివి చేయండి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపండి. దీంతో అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు. ఇది మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే తప్పనిసరిగా ఈ వ్యాధితో బాధపడుతోన్న వారు 8 గంటలు నిద్రపోవాలి. సామాజిక సంబంధాలు పెంచుకోండి. ఫ్రెండ్స్, రిలేషన్స్, సన్నిహితులతో కమ్యూనికేట్ అవ్వండి.
క్యాబేజీ తినండి..
అలాగే క్యాబేజీ తినండి. ఇందులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం సమృద్ధిగా ఉంటాయి. బోన్స్‌ను స్ట్రాంగ్‌గా ఉంచడమే కాకుండా.. అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెడుతుంది. క్యాబేజీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మలబద్ధకాన్ని నివారిస్తుంది. హార్ట్ సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధికి మంచి మెడిసిన్‌లా యూజ్ అవుతుంది.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.