యాసిడ్ రిఫ్లక్స్‌తో గుండెల్లో మంట.. నివారణ కోసం ఇలా చేయండి

by Hamsa |   ( Updated:2023-06-11 13:47:25.0  )
యాసిడ్ రిఫ్లక్స్‌తో గుండెల్లో మంట.. నివారణ కోసం ఇలా చేయండి
X

దిశ, ఫీచర్స్: జీర్ణ ప్రక్రియలో యాసిడ్ రిఫ్లక్స్‌వల్ల గుండెల్లో మంట(heartburn), కడుపులో అసౌకర్యం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. కొన్ని సహజమైన పద్ధతులవల్ల ఈ రిస్క్ నుంచి బయట పడవచ్చు అంటున్నారు గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు. నిజానికి కడుపులో ఎటువంటి సమస్యలు లేకపోవడం అనేది ఆరోగ్య కరమైన జీవిత మార్గానికి నిదర్శనం. కానీ అప్పుడప్పుడు కొందరికి స్వల్ప అసౌకర్యం మొదలై తీవ్రమైన సమస్యలకు దారి తీస్తూ ఉంటుంది. యాసిడ్ రిఫ్లక్స్ అండ్ హార్ట్ బర్న్ కూడా అలాంటిదే.

గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి (GERD)వల్ల ఇది సంభవిస్తుంది. స్టమక్ యాసిడ్ పదే పదే నోటిని, కడుపును కలిపే ట్యూబ్‌(అన్నవాహిక)లోకి తిరిగి ప్రవహించినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ బ్యాక్‌ వాష్ (acid reflux) అన్నవాహిక యొక్క లైనింగ్‌ను ఇరిటేట్ చేస్తుంది. దీనివల్ల చాలామంది యాసిడ్ రిఫ్లక్స్‌ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఈ పరిస్థితి అనుభవించడాన్నే గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి అని కూడా పిలుస్తారు. అయితే ఇంట్లోనే ఎవరికివారు పాటించే కొన్ని నాచురల్ రెమిడీస్ వల్ల యాసిడ్ రిఫ్లక్స్, గుండెల్లో మంట లక్షణాలను తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

ఏం చేయాలి?

ఒకేసారి ఫుల్లుగా తినడం కారణంగా అది సరిగ్గా జీర్ణం కాకపోవడంవల్ల యాసిడ్ ఫిప్లక్స్, గుండెల్లో మంట సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి ఒకేసారి ఎక్కువమొత్తంలో తినడాన్ని నివారించాలి. రోజులో మూడుసార్లు భారీ భోజనం తినడానికి బదులుగా.. రోజంతా కనీసం 5 నుంచి 6 సార్లు తక్కువ పరిమాణంలో తినాలి. దీనివల్ల ఎక్స్‌ట్రా యాసిడ్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఆహారం సక్రమంగా జీర్ణమై హార్ట్ బర్న్, గుండెల్లో మంట సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. దీంతోపాటు సమతుల్యతకోసం ఫైబర్ కలిగిన ఆహారం తీసుకోవడం మేలు చేస్తుంది.

ఎందుకంటే ఇది యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గించి, సరైన జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. అల్లంలో కూడా యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గించే గుణం ఉంటుంది. కాబట్టి గుండెల్లో మంట సమస్యను ఎదుర్కొంటున్న వారు ప్రతీరోజు ఉదయం తరిగిన అల్లం ముక్కల్లో తేనె లేదా చక్కెర కలుపుకొని తినడంవల్ల ఉపశమనం లభిస్తుంది. ఇది అన్నవాహికలో వాపును కూడా తగ్గిస్తుంది. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడంవల్ల యాసిడ్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల ఆహారం చక్కగా జీర్ణం కావడానికి తగిన సమయం లభిస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ సంభావ్యతను తగ్గిస్తుంది.

ఇవి కూడా చదవండి:

దీర్ఘకాలిక ఒత్తిడితో అధిక బరువు పెరుగుతారు.. ఎందుకో తెలుసా?

Advertisement

Next Story

Most Viewed