- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చాణక్య నీతి : జీవితంలో ఎదగాలంటే ఈ టిప్స్ పాటించాలి
దిశ, ఫీచర్స్ : జీవితంలో సక్సెస్ కావాలని ప్రతీ ఒక్కరు కోరుకుంటారు. కానీ కొంత మంది మాత్రమే తమ గమ్యాన్ని చేరుకొని సంతోషంగా ఉంటారు. అయితే ఆచార్యచాణక్యుడు తన నీతి శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలిపాడు. అందులో విజయానికి సంబంధించిన కొన్ని విషయాలను తెలియబరిచాడు.
మీరు మీ జీవితంలో వైఫల్యాలను ఎదుర్కొని విజయం పొందాలంటే కొన్ని టిప్స్ పాటించాలంట. అవి :
కృషి : కృషి ఉంటే మనుషులు షులవుతారు మహా పురుషులవుతారు..అనే పాట వినే ఉంటాం. ఒక వ్యక్తి తన కృషి ఆధారంగా అసాధ్యమైన ప్రతి విషయాన్ని సుసాధ్యం చేయగలడు.అందువలన ఏ పనినైనా కృషితో చేయాలంట.
పొదుపు చేయడం : అతిగా ఖర్చుపెట్టేవాడు ఎప్పుడూ జీవితంలో సక్సెస్ కాలేడంట. అందువలన డబ్బును పొదుపుగా వాడుకోవాలంటున్నాడు చాణక్యుడు.
ఆత్మవిశ్వాసం : ఆత్మవిశ్వాసమే మహాబలం. ఆత్మవిశ్వాసం ఉంటే ఎంతకష్టమైన పనినైనా సరే చాలా ఈజీగా చేయగలుగుతాం. అందుకే ఏ పని చేసినా.. ఆత్మవిశ్వాసంతో చేయాలంట.
ఓర్పు,పట్టుదల : మనిషికి ఓర్పు పట్టుదల అనేది ఉండాలి. ప్రతీ చిన్న విషయానికి కుంగిపోకుండా.. ఎంతటి కష్టకాలాన్ని అయినా సరే ఎదుర్కొని సంతోషంగా ఉండాలంట. అలాంటప్పుడే సక్సెస్ మీ సొంతం అవుతుంది అంటున్నారు ఆచార్యచాణక్యుడు