shining caves: కాంతిని వెదజల్లుతున్న కొండగుహలు.. ఆకర్షించే మెరుపులతో..

by Javid Pasha |
shining caves: కాంతిని వెదజల్లుతున్న కొండగుహలు.. ఆకర్షించే మెరుపులతో..
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా కొండ గుహలు చీకటిగా, భయానకంగా, చెట్లు, పొదల అల్లికలతో కప్పబడి కనిపిస్తుంటాయి. వాటిలోపల పులులు, సింహాలు, పాములు, తేళ్లు వంటివి నివాసం ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి అక్కడికి వెళ్లాలంటేనే చాలామంది భయపడుతుంటారు. కానీ న్యూజిలాండ్‌ దేశంలో నార్త్ ఐలాండ్‌లో గల వైటోమోలోని గుహలు మాత్రం అందుకు భిన్నం. ఎందుకంటే ఇవి మెరిసే గుహలు.. చూడగానే తళుక్కుమంటూ ఆకర్షిస్తుంటాయి.

నిరంతరం కాంతిని వెదజల్లుతూ ఉండటం కారణంగా న్యూజిలాండ్ వైటోమో గుహలు ఇప్పుడు వరల్డ్ ఫేమస్ టూరిస్ట్ స్పాట్‌గా మారాయి. అద్భుతమైన రాతి నిర్మాణాలు, వాటిపై కాంతిని వెదజల్లే కీటకాలతో ఆకట్టుకోవడంవల్ల ఎంతోమంది అక్కడికి వస్తుంటారు. అయితే ఈ గుహలు అలా మెరవడానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ఏంటంటే.. ఇక్కడ గ్లోవార్మ్ అనే కీటకాలు నివసిస్తుంటాయి. వాస్తవానికి అవి అరాక్నో కాంపా అనే ఒక రకమైన దోమ జాతికి చెందినవని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిణుగురు పురుగుల మాదిరి ఈ అరుదైన కీటకాలు కాంతిని వెదజల్లుతాయి. గుహలలో చీకటిగా ఉండటం, ఆ కీటకాలు కాంతిని వెదజల్లుతూ తిరగడం, బయట నిర్మించిన గోడలపై వచ్చి వాలడం కారణంగా గుహలతోపాటు చుట్టు పక్కల కొద్ది దూరం వరకు ప్రసరింపబడిన కాంతితో ఆ ఏరియా అంతా తళుక్కున మెరుస్తూ ఆకట్టుకుంటుంది.

Advertisement

Next Story

Most Viewed