గ్రాడ్యుయేట్ ప‌ట్టా పొందిన పిల్లి..?!

by Sumithra |
గ్రాడ్యుయేట్ ప‌ట్టా పొందిన పిల్లి..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః గ్రాడ్యుయేషన్ డే విద్యార్థుల‌కు వారి త‌ల్లిదండ్రుల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన రోజు. సంవ‌త్స‌రాల క‌ష్టంతో జ్ఞానం సంపాదించార‌న‌డానికి ఆరోజు తీసుకునే గ్రాడ్యుయేష‌న్ ప‌ట్టానే సాక్ష్యం. అలాంటి రోజున ఓ పిల్లి గ్రాడ్యుయేష‌న్‌ వేషధారణలో ప‌ట్టా తీసుకుంటూ దిగిన ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఎంతో క‌ష్ట‌ప‌డితే గానీ రాని ప‌ట్టా ఈ పిల్లికి భ‌లే వ‌చ్చిందే అంటూ నెటిజ‌నులు ఆ పిల్లిని తెగ ప్ర‌శంసిస్తున్నారు. Franny అనే ఖాతాదారు Instagram పేజీలో ఈ ఫోటోల‌ను పోస్ట్ చేశారు. ఇందులో, "అవును, నా పిల్లి నేను పాల్గొన్న‌ ప్రతి జూమ్ లెక్చర్‌కి హాజరయ్యింది. కాబట్టి మేమిద్దరం కలిసి ఆస్టిన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించాము" అని ఆమె, ఆమె పెంపుడు పిల్లితో దిగిన ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఇద్దరూ ఒకే ర‌క‌మైన దుస్తులు ధరించడం విశేషం. మీరూ చూడండి..

Advertisement

Next Story

Most Viewed