Cancer risk factors : ఇంట్లో ఈ వస్తువులు వాడుతున్నారా?.. క్యాన్సర్ రిస్క్ పెరిగే‌ చాన్స్ ఉంది జాగ్రత్త!

by Javid Pasha |
Cancer risk factors : ఇంట్లో ఈ వస్తువులు వాడుతున్నారా?.. క్యాన్సర్ రిస్క్ పెరిగే‌ చాన్స్ ఉంది జాగ్రత్త!
X

దిశ, ఫీచర్స్ : ఓ వైపు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో దూసుకుపోతున్నప్పటికీ.. మరోవైపు అది తెచ్చిన మార్పులతో కొత్త సమస్యలు కూడా వచ్చిపడుతున్నాయని పర్యావరణ, ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే వివిధ కాలుష్యాలు, వాటి ప్రభావాలు మానవ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుండగా.. ప్రస్తుతం ఇంట్లో వాడే వస్తువులు కూడా ఆ లిస్టులో చేరాయి. వీటి తయారీలో ఉపయోగించే రసాయయనాల కారణంగా హెల్త్ రిస్క్‌ను పెంచుతున్నాయి. అయితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే కొన్ని రకాల వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నాస్ స్టిక్ మెటల్స్

ప్రస్తుతం చాలా మంది వంట ఈజీగా, స్పీడ్‌గా అయిపోతుందనే ఉద్దేశంతో నాన్ స్టిక్ వంట పాత్రలను ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఎందుకంటే వాటిని తయారు చేసే క్రమంలో టెఫ్లాన్ కోటింగ్ ఇస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఆ పాత్రలతో వంట చేసేటప్పుడు అధిక ఉష్ణోగ్రతల కారణంగా హానికారకమైన పెర్‌ప్లోరినేటెడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. వీటికి గురైతే క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. వీటికి బదులు సిరామిక్, కాస్ట్ ఐరన్ వంటి పాత్రలు వాడటం బెటర్ అంటున్నారు.

సువాసనలు వెద్దజల్లే క్యాండిల్స్

ఇంటినిండా సువాసన వెదలజ్లుతుంటే మంచిగా అనిపిస్తుందని కొందరు ‘సెంటెడ్ క్యాండిల్స్’ యూజ్ చేస్తుంటారు. కానీ వీటివలల్ బెంజీన్, టోల్యూన్ వంటి డేంజరస్ కెమికల్స్ రిలీజ్ అవుతాయని, వీటికి ఎక్స్‌పోజ్ కావడంవల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. కాబట్టి వీటికి బదులు సాధారణ కొవ్వొత్తులు లేదా బీ వ్యాక్స్ క్యాండిల్స్ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

హౌస్ క్లీనింగ్ మెటల్స్

ప్రస్తుతం బాత్ రూమ్‌తో పాటు ఇంటిని క్లీన్ చేయడానికి రకరకాల క్లీనింగ్ మెటల్స్ మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. అయితే అవి ఏ బ్రాండ్ అయినప్పటికీ వీటిలో ఫార్మాల్డిహైడ్, క్లోరిన్, బ్లీచ్, అమ్మోనియా వంటి కెమికల్స్ ఉంటాయి. వీటివల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. సో.. బేకింగ్ సోడా, వెనిగర్ వంటి నేచురల్ పద్ధతులను ఫాలో అవడం బెటర్ అంటున్నారు పర్యావరణ నిపుణులు.

చాపింగ్ బోర్డులు

ప్రస్తుతం చాలామంది కూరగాయలు కట్ చేయడానికి ప్లాస్టిక్ చాపింగ్ బోర్డులు యూజ్ చేస్తుంటారు. కొందరు ఇవి పాడైనప్పటికీ పడేయకుండా వాడుతుంటారు. కానీ ఇది ప్రమాదకరం. ఎందుకంటే ఆహారం ద్వారా వీటిలోని మైక్రో ప్లాస్టిక్స్ శరీరంలోకి వెళ్తాయి. కాబట్టి వీటికి ప్రత్యామ్నాయంగా చెక్కతో తయారు చేసిన చాపింగ్ బోర్డులు వాడితే బెటర్.

ప్లాస్టిక్ డబ్బాలు

ప్రస్తుతం సబ్బు పెట్టె మొదలు కొని కూర్చునే చెయిర్ వరకు ప్లాస్టిక్‌తో తయారైన వాటిని వినియోగిస్తున్నాం. ఇక ఇంట్లో వంట సామగ్రి, ముఖ్యంగా జిలకర, ఆవాలు, ధనియాలు వంటి సుగంధ ద్రవ్యాలు స్టోర్ చేయడానికి ప్లాస్టిక్ డబ్బాలను చాలామంది యూజ్ చేస్తుంటారు. అయితే వీటిలో బిస్పెనాల్ ఎ, థాలేట్స్ వంటి హానికారక మెటల్స్ ఉంటాయి. కాబట్టి అవి ఆరోగ్యానికి హానికరం. తరచుగా ప్లాస్టిక్ డబ్బాల్లో ఆహార పదార్థాలను నిల్వ చేసి యూజ్ చేయడంవల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అవగాహనకోసం మాత్రమే అందిస్తున్నాం. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed