షాకింగ్.. పానీ పూరీతో క్యాన్సర్ ముప్పు

by Sujitha Rachapalli |
షాకింగ్.. పానీ పూరీతో క్యాన్సర్ ముప్పు
X

దిశ, ఫీచర్స్: పానీ పూరీ కనపడితే చాలు నోరు ఊరుతుంది. కనీసం ఒక్కటైనా తింటే బాగుండు అనిపిస్తుంది. తినడం మొదలు పెడితే అప్పుడే ప్లేట్ తినేసామా అన్నట్లు ఉంటుంది. ఇక పానీ పూరీ లవర్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. ధర కూడా తక్కువే కాబట్టి ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మాయిలు, కాలేజీ స్టూడెంట్స్ ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కానీ తాజాగా నిపుణులు వీరికి బ్యాడ్ న్యూస్ చెప్పారు. ఇందులో కలుస్తున్న కెమికల్స్ క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయని తెలిపారు. వీటిని తినడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు.

గోల్ గప్పా క్రేజ్ ఇండియా వైడ్ నెక్స్ట్ లెవల్ లో ఉండగా.. వరల్డ్ వైడ్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. అయితే ఫుడ్ సేఫ్టీ అధికారులు మాత్రం షాకింగ్ విషయాలు వెల్లడించారు. కర్ణాటకలో దాదాపు 20 శాంపిల్స్ పరీక్షించిన ఆఫీసర్లు.. వీటిలో 22శాతం క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ ఉన్నట్లు గుర్తించారు. సేఫ్టీ స్టాండర్స్ మెయింటైన్ చేయడంలో వెండార్స్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని వివరించారు. పానీ పూరీకి దూరంగా ఉంటూ హెల్త్ కాపాడుకోవాలని సూచించారు.

Advertisement

Next Story

Most Viewed