- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీ నోటి నుండి దుర్వాసన వస్తుందా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే
దిశ, ఫీచర్స్ : చాలామంది ఎన్నిసార్లు నోటిని శుభ్రం చేసుకున్నా వారి నోరు దుర్వాసన వెదజల్లుతుంది. సాధారణంగా ఇది చాలా మంది ఎదుర్కొంటున్న సాధారణ సమస్య మాత్రమే. ఏదైనా భుజించినప్పుడు ఆ ఆహారం పల్ల మధ్యలో ఇరుక్కుపోయినప్పుడు నోట్లో బ్యాక్టీరియా ఫాం అయి నోరు దుర్వాసన వస్తుంది. అలాగే నోటిని సరిగ్గా శుభ్రం చేసుకోకపోయినా దుర్వాసన వ్యాప్తి చెందుతుంది. ఈ సమస్యను హాలిటోసిస్ అని కూడా పిలుస్తారు.
అయితే కొన్నిసార్లు గుండె సమస్యలు రాబోతున్నాయనడానికి హెచ్చరికగా నోటిదుర్వాసన వస్తుంది. కొంతమంది వైద్యనిపుణులు మాత్రం గుండె జబ్బులకు, నోటి దుర్వాసనకు ఏదో సంబంధం ఉందని చెబుతున్నారు. అందుకే ఎవరైనా చాలా రోజుల నుంచి నోటినుంచి దుర్వాసన వస్తే అప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.
నోటి దుర్వాసన.. గుండె జబ్బుల మధ్య లింక్ ఏమిటి..
రక్తప్రవాహం ద్వారా కొన్నిరకాల బాక్టీరియా చిగుళ్ళ నుంచి శరీరంలోని అన్నిభాగాలకు ప్రవహిస్తుంది. కణజాలంలోకి ఆ బ్యాక్టీరియా ప్రవేశించి శరీరంలోని సూక్ష్మరక్తనాళాలలోకి ప్రవేశిస్తుంది.
రక్తప్రవాహంలో బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటే అది రోగనిరోధక వ్యవస్థతో పోరాడి తాపజనక ప్రతిచర్యను సృష్టిస్తుంది. ఈ తాపజనక ప్రతిచర్య కారణంగా ధమనులు ఉబ్బి రక్త ప్రవాహానికి అడ్డుగా ఉంటుంది. అందుకే గుండెపోటు, పక్షవాతం, ధమనులు గట్టిపడటం లాంటి సమస్యలను ఎక్కువగా చిగుళ్ల వ్యాధి ఉన్నవారు ఎదుర్కొంటారు. ప్రపంచంలో 30 శాతం మంది ప్రజలు ఈ నోటి దుర్వాసనతో ఇబ్బందులను పడుతున్నారు.
నోటి దుర్వాసన సమస్యకు ఎలా చెక్ పెట్టాలి..
ప్రతి 6 నెలలకు ఒకసారి దంతవైద్యుడిని సంప్రదించి దంతాలను, చిగుళ్లను చెక్ చేయించుకోవాలి.
రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోవాలి.
మాంసాహారాన్ని తక్కువగా తీసుకోవాలి.
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఎక్కువగా తినాలి.
రోజులో 3 లీటర్ల వరకు నీళ్లు తాగాలి.
ఆల్కహాల్ పానీయాలు, పొగాకు అలవాటు ఉన్నావారు దాన్ని మానుకోవాలి.
రోజు రాత్రి మౌత్‌వాష్‌తో నీటిలో కలిపి పుక్కిలించుకుని నోటిని శుభ్రం చేసుకోవాలి.