ఆ సమయంలో బీట్‌ రూట్ జ్యూస్ తాగవచ్చా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..

by Javid Pasha |
ఆ సమయంలో బీట్‌ రూట్ జ్యూస్ తాగవచ్చా?.. నిపుణులు ఏం చెప్తున్నారంటే..
X

దిశ, ఫీచర్స్ : బీట్‌ రూట్‌ను కూరగా వండుకొని తినడం, పచ్చిగా తినడం, అలాగే దానితో జ్యూస్ తయారు చేసుకొని తాగడం సహజంగానే ఆరోగ్యానికి మంచిది. కానీ స్త్రీలు నెలసరి సమయంలో, అలాగే మెనోపాజ్ దశలో తాగితే ఆరోగ్యానికి మంచిది కాదనే అనుమానాలు ఇప్పటికీ కొందరిలో వ్యక్తం అవుతుంటాయి. కానీ ఇది నిజం కాదని నిపుణులు అంటున్నారు. పైగా బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది. అయితే దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూద్దాం.

* మెన్‌స్ట్రువల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి మొదలవుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉండేందుకు దోహదం చేస్తుంది. రక్తనాళాలు, ఎముకలు, గుండె ఆరోగ్యానికి ఈస్ట్రోజెన్ ఎంతో అవసరం. అయితే బీట్ రూట్ జ్యూస్ కూడా ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తికి ప్రేరణగా నిలుస్తుంది. కాబట్టి తాగితే మంచిది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో మహిళలు ఈ జ్యూస్ తాగితే గుండె బలానికి మంచిదని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

* పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ స్టడీ ప్రకారం.. డైలీ బీట్ రూట్ జ్యూస్ తాగడంవల్ల శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగు పడుతుంది. ఇది అన్ని రకాల శారీరక, మానసిక ఇబ్బందుల నివారణలో చాలా ముఖ్యం. బీట్‌రూట్ జ్యూస్‌లో పోషకాలు, నైట్రేట్‌లు అధికంగా ఉండటంవల్ల రక్తనాళాల ఆరోగ్యానికి కూడా మంచిది. స్త్రీలలో మెనోపాజ్ తర్వాత సహజంగానే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపించడానికి అప్పటికే వారిలో ఈస్ట్రోజెన్ సరిపోకపోవచ్చు. కాబట్టి నైట్రిక్ ఆక్సైడ్ పెంపొందించే ఆహారాల్లో భాగంగా బీట్‌ రూట్ ముఖ్యమైంది. దీంతోపాటు పాలకూర, బచ్చలికూర, ముల్లంగి, క్యాబేజీ, ఇతర దుంపగడ్డల్లోనూ నైట్రిక్ ఆక్సైడ్, ఇతర పోషకాలు అందించే గుణం ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed