- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షుగర్ ఉన్నవారు ఖర్జూరాలు తినొచ్చా.. తింటే ఏమవుతుందో తెలుసా..
దిశ, ఫీచర్స్ : ఈ మధ్య కాలంలో ఎక్కువమంది బీపీ, షుగర్, థైరాయిడ్ తో బాధపడుతున్న వారే. చిన్న పిల్లల నుంచి మొదలుకుని పెద్దవారి వరకు వంశపారంపర్యంగా వస్తున్న ఈ సమస్యలతో పోరాడుతున్నారు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వైద్యున్ని సంప్రదించి వైద్యం తీసుకోవాలి. అలాగే తినే తిండి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా షుగర్ వ్యాధి.
ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే చాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి.. తినే తిండి విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. షుగర్ లెవల్ పెరగని ఆహారాన్ని మాత్రమే డైట్ లో ఫాలో కావాలి. అయితే కొంతమంది మాత్రం ఏ ఆహారాన్ని తినాలి, దేన్ని తినకూడదో తెలియకుండా అన్ని తినేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా ఇతర అవయవాల పై ఎఫెక్ట్ చూపి లేవలేని స్థితికి చేరుకుంటారు. మరి మధుమేహం సోకిన వారు ఖర్జూరంని తినొచ్చా.. అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయి.. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ మధుమేహగ్రస్తులు తినొచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాల్లో ఉండే సెలీనియం, కాల్షియం, కాపర్, సోడియం, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యపోషకాలు శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతుంది. అందులో 43 నుంచి 55 శాతం ఉండే గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరగనివ్వవు. అలాగని ఎక్కువ తినకుండా వైద్యుల సలహా మేరకు తినాలి.. 100 గ్రాముల ఖర్జూరంలో 8 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ ఫైబర్ షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్ప్ చేస్తుంది.
అలాగే పెద్దపేగులోని సమస్యలకు ఖర్జూరం ఎంతో ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబు, శ్లేష్మం లాంటివాటికి ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందు. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడతారు. చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. ఖర్జూరం తినడం వలన మలబద్ధకం తగ్గుతుంది. ఎముకలు బలంగా తయారవుతాయి, ఉదర క్యాన్సర్ తగ్గుతుంది. ఖర్జూరంలో ఉండే ఐరన్ శాతం రక్తహీనత తగ్గించడంలో సహాయపడుతుంది.