డ్యాన్స్‌తో గుండె పోటు..?

by sudharani |   ( Updated:2022-12-03 14:54:32.0  )
డ్యాన్స్‌తో గుండె పోటు..?
X

దిశ, ఫీచర్స్ : 40 ఏళ్ల వయసున్న వ్యక్తికి సంబంధించిన డ్యాన్స్ వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉంది. వెడ్డింగ్ ఈవెంట్‌లో ఉత్సాహంగా స్టెప్స్ వేస్తూ కనిపించిన ఆయన.. ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. తర్వాత ఆ వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని తెలిసింది. ఇక సెప్టెంబర్‌లో గణేశ్ నిమజ్జనోత్సవం సందర్భంగా డ్యాన్స్ చేస్తున్న 20 ఏళ్ల యువకుడు గుండెపోటుకు గురైన సంఘటన కూడా ఇలాంటిదే. దీంతో డ్యాన్స్ చేస్తే గుండె ఆగిపోతుందా అనే అనుమానం వస్తుండగా.. దీని వెనుక కారణాలను వివరిస్తున్నారు నిపుణులు. నిజానికి హార్ట్‌ఫుల్‌గా డ్యాన్స్ చేస్తే రిలీఫ్ ఉంటుందని కొందరు చెప్తుంటారు కానీ ఇది అందరికీ మంచిది కాకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.

డ్యాన్స్ - కార్డియాక్ అరెస్ట్ మధ్య లింక్

డ్యాన్స్ మరియు కార్డియాక్ అరెస్ట్ మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. అయితే అలవాటు లేని ఆకస్మిక వ్యాయామం వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. శారీరకంగా చురుకుగా ఉండని వ్యక్తి సడెన్‌గా డ్యాన్స్ చేయడం, ట్రెడ్‌మిల్‌పై ఎక్సర్‌సైజ్ చేయడం, స్పోర్ట్స్‌లో పాల్గొనడం చేసినట్లయితే.. ఆ వ్యక్తికి గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. అంటే డ్యాన్స్ వల్ల కాదు కానీ అకస్మాత్తుగా అలవాటు లేని శారీరక కదలిక చేయడం ద్వారా కార్డియాక్ అరెస్ట్‌ సంభవిస్తుంది.

డ్యాన్స్ విత్ డ్రింక్స్‌తో ప్రమాదముందా?

వివాహ వేడుకలో లేదా స్నేహితులతో ఆనందిస్తున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం సాధారణం. మరికొందరు డ్రగ్స్ కూడా ప్రయత్నిస్తారు. అయితే ఈ ఎపిసోడ్‌ను డ్యాన్స్‌తో లింక్ చేసినట్లయితే గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ డ్యాన్సింగ్ అట్మాస్పియర్ అధిక ఆడ్రినలిన్ రష్, ఎగ్జయిట్మెంట్ నేచర్‌తో సంబంధం ఉండి.. గుండె ఆగిపోయే పరిస్థితికి కారణమవుతుంది.

ఫ్యామిలీ హిస్టరీ కారణమవుతుందా?

సాధారణంగా అమ్మ లేదా నాన్న వైపు ఉన్న ఎవరికైనా గుండె జబ్బు ఉంటే ఇది సంభవించగలదని చెప్తున్నారు నిపుణులు. కొన్ని జన్యుపరమైన అసాధారణతలు ఒక వ్యక్తి గుండె ఆగిపోయేలా చేస్తాయని వివరించారు.

* లాంగ్ QT సిండ్రోమ్ : ఇది గుండె కొట్టుకునే విధానాన్ని ప్రభావితం చేసే వారసత్వంగా వచ్చే హార్ట్ ప్రాబ్లమ్. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం యువకులలో లేదా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులలో ఆకస్మిక గుండె మరణానికి ఇదొక కారణం.

* బ్రుగాడా సిండ్రోమ్ : NHS ప్రకారం, గుండె ప్రమాదకరంగా వేగంగా కొట్టుకునేలా చేసే అరుదైన, తీవ్రమైన పరిస్థితి. ఇది సాధారణంగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఫాల్టీ జీన్స్ వల్ల వస్తుంది.

* హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి : ఇది చాలా తరచుగా గుండె కండరాలలోని అసాధారణ జన్యువుల వల్ల సంభవిస్తుంది. హైపర్‌ట్రోఫిక్ కార్డియోమయోపతి అభివృద్ధి చెందుతున్నప్పుడు.. ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, ఇది గుండె వైఫల్యానికి దారితీయవచ్చు, ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్‌కు కారణం కావచ్చు.

* డయాబెటీస్ వర్సెస్ డ్యాన్స్ : ధూమపానంతో పాటు గుండె సమస్యలకు ప్రధాన ప్రమాద కారకాల్లో మధుమేహం ఒకటి. కాబట్టి డయాబెటిస్ పేషెంట్స్ డ్యాన్స్‌కు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే మధుమేహం, శక్తివంతమైన నృత్యం కాంబినేషన్ ఆరోగ్యానికి పెద్దగా మేలు చేయకపోవచ్చు.

* నిశ్చల జీవనశైలి చాంపియన్స్ జాగ్రత్త

రెగ్యులర్‌గా వర్కవుట్ చేస్తే అకస్మాత్తుగా నృత్యం చేయడం వల్ల సమస్యేమీ లేదు. కానీ ఎవరైనా నిశ్చల జీవితాన్ని గడుపుతూ, అకస్మాత్తుగా డ్యాన్స్ చేయడం లేదా వ్యాయామం చేయడం ప్రారంభిస్తే అది కార్డియాక్ అరెస్ట్‌కు దారితీయవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఫైనల్లీ.. బై బై డ్యాన్స్?

మీరు నృత్యానికి దూరంగా ఉండవలసిన అవసరం లేదు. కుటుంబంలో ప్రమాద కారకం ఉంటే మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. రెగ్యులర్ చెక్-అప్‌లకు వెళ్లాలి. అంతేకాదు అన్ని జిమ్‌లలో జిమ్ ట్రైనర్‌లు CPR సర్టిఫికేట్ పొందే చట్టం ఉండాలని, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేటర్ (AED)ని ఉంచాలని సూచిస్తున్నారు నిపుణులు. ఈ విధంగా ప్రజలు కార్డియాక్ అరెస్ట్ గురించి చింతించకుండా జిమ్ చేయొచ్చు, నచ్చినట్లుగా హార్ట్‌ఫుల్‌గా ఎంజాయ్ చేయొచ్చు.




Also Read.......

మానవాళికి మహోపదేశం భగవద్గీత

Advertisement

Next Story

Most Viewed