- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తకు భార్య రాఖీ కట్టవచ్చా.. కడితే ఏం జరుగుతుంది.. పురాణాలు ఏం చెబుతున్నాయంటే?
దిశ, ఫీచర్స్: రక్షాబంధన్ అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు సంబంధించిన పండుగ. దీనిని శ్రావణ మాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున సంతోషంగా జరుపుకుంటారు. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో ఇది కూడా ఒకటి. అయితే దీనిని తోబుట్టువులు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వారికి రాఖీ కడతారు. అలాగే రక్షగా ఉండాలని చెప్పడానికే ఈ పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే ఈ ఏడాది పంచాంగం ప్రకారం రాఖీ పండుగ ఆగస్టు 19న వచ్చింది. అయితే ఈ రాఖీ పండుగ నాడు ప్రపంచ నలుమూలల ఎక్కడున్నా సరే సోదరులకు రాఖీ కట్టడానికి సోదరీమణులు పుట్టింటికి వెళతారు. ఒకవేళ రాలేని పరిస్థితి ఉంటే.. కచ్చితంగా కొరియర్ ద్వారా రాఖీ మాత్రం పంపుతారు.
ఆ రోజు వీడియో కాల్ చేసి మరీ శుభాకాంక్షలు చెబుతారు. రాఖీ పండుగకు ఉన్న స్పెషాలిటీ మరే దానికి లేదనడంలో అతిశయోక్తి లేదు. అయితే రాఖీ పండుగను అన్నాచెల్లెళ్ల బంధానికి ప్రతీకగా చేసుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. భార్యా, భర్తలు, వీడిపోయిన వారి చూసి ఉంటారు కానీ అన్నాచెల్లెల్లు మాత్రం ఎన్ని గొడవలు అయినా సరే మళ్లీ కలిసిపోతారు. అయితే రాఖీ భర్తకు భార్య కట్టొచ్చో లేదో అనే భావన చాలా మందిలో కలుగుతుంది. కొంతమంది కట్టవద్దని అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముడు మాత్రమే కట్టుకోవచ్చని అనుకుంటుంటారు. కానీ భార్య, భర్తకు రాఖీ కట్టవచ్చు అని పురాణాలు చెబుతున్నాయి.
రాఖీ అనేది అన్నదమ్ముల ప్రేమను సూచించేది మాత్రమే కాదు భర్త క్షేమంగా ఉండి తాను కొత్తగా చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని అలాగే మీకు రక్షణగా ఉండాలని చేతికి రక్షగా రాఖీ కట్టవచ్చు అని పండితులు చెబుతున్నారు. అయితే పురాణాల ప్రకారం.. దేవతలు, రాక్షకుల మధ్య జరిగిన యుద్ధ సమయంలో దేవేంద్రుడు ఓడిపోయి ఓ చోట దాచుకుంటాడు. ఈ సమయంలోనూ శచీదేవి భర్తలో ఉత్సాహాన్ని నింపుతుంది. అయితే అదే రోజు రాఖీ పౌర్ణమి కావడంతో భర్తకు రక్ష కట్టి యుద్దానికి పంపుతుందట. దీంతో ఆయన యుద్ధంలో గెలిచి వచ్చారని తెలుస్తోంది. ఆమె కట్టిన రక్ష వల్లనే గెలిచాడనే వాదన కూడా ఉంది. ప్రజెంట్ ఇదే స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read more...