అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!

by Anjali |
అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంటున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్లే..!
X

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా అల్లం పురాతన కాలం నుంచి ఒక ఔషధంగా, మసాలాగా ఉపయోగపడుతుంది. అల్లంలో విటమిన్ సి, జింక్, కెరోటినాయిడ్స్, ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అల్లంలోని యాంటీ యాక్సిడెంట్ గుణాలు.. జలుబు, దగ్గును నివారించడంలో సహాయపడుతుంది. మధుమేహం - ఆర్థరైటిస్ రోగులకు మేలు చేస్తుంది. అల్లం తీసుకోవడం మధుమేహ ప్రమాదాన్ని తగ్గించడంలో మేలు చేస్తుంది.

రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఆర్థరైటిస్ రోగులకు ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలున్న అల్లాన్ని భారతీయులు ప్రతిరోజూ కూరలో తప్పనిసరిగా వాడుతారు. ఇక చికెన్ మటన్ లాంటి నాన్ వెజ్ కర్రీల్లో అయితే కొంచెం ఎక్కువగానే ఉపయోగిస్తారు. దీంతో కూరలు ఎంతో రుచితో పాటు అదిరిపోయే వాసన కూడా వస్తుంది. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.

అయితే కొంతమంది అల్లం మిశ్రమాన్ని ఇంట్లోనే తయారు చేస్తారు. కొంతమంది బయట షాపుల్లో కొంటారు. కాగా బయట షాపుల్లో కొనుగోలు చేయడం అస్సలు మంచిది కాదని.. ప్రజల అవసరాన్ని గ్రహించి కేటుగాళ్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కల్తీ చేసేస్తున్నారని, పలు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ను ఫ్రెష్‌గా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండటమే కాకుండా ఎలాంటి డౌట్ లేకుండా వాడుకోవచ్చంటున్నారు నిపుణులు.

Advertisement

Next Story