Bride dancing : ‘సింగిల్ రెహెనే దే’ సాంగ్‌కు వధువు అదిరిపోయే డ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో

by Javid Pasha |   ( Updated:2024-08-24 06:11:42.0  )
Bride dancing : ‘సింగిల్ రెహెనే దే’ సాంగ్‌కు వధువు అదిరిపోయే డ్యాన్స్.. వైరలవుతోన్న వీడియో
X

దిశ, ఫీచర్స్: సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పుడు ఏది ట్రెండ్ అవుతుందో, ఏ వీడియో వీక్షకులను ఆకట్టుకుంటుందో ఊహించడం కష్టం. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్‌బుక్.. ఇలా రకరకాల ప్లాట్‌ఫామ్స్ ద్వారా యువతీ యువకులు తమ టాలెంట్‌‌ను ప్రదర్శిస్తూ ఫేమ్ సంపాదించుకుంటున్నారు. అదే సందర్భంలో రకరకాల స్టంట్లు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నవారు కూడా లేకపోలేదు.

ఏది ఏమైనా జనానికి నచ్చే కంటెంట్ ఉంటే చాలు. అది సందర్భం ఏదైనా క్షణాల్లో వైరల్ అవుతుంటాయి కొన్ని సంఘటనలు. అలాంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో ఓ వధువు బాలీవుడ్ సూపర్ హిట్ సాంగ్‌కు డ్యాన్స్ చేయడం చాలా మందిని ఆకట్టుకుంది. వైరల్ వీడియో సమాచారం ప్రకారం.. అక్కడ పెళ్లి జరుగుతోంది. వధూ వరులు, వారి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా వేడుకును ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలోనే వధువు స్వయంగా వేదిక వద్దకు వచ్చి బాలీవుడ్ మూవీ సాంగ్ అయిన ‘సింగిల్ రెహెనే దే’ పాటకు అనుగుణంగా స్టెప్పులేస్తూ, హావ భావాలు ప్రదర్శిస్తూ డ్యాన్స్ చేసింది.

కాగా వధువు డ్యాన్స్ చేస్తుండగా అక్కడే కూర్చున్న వరుడితో సహా పెళ్లికి వచ్చిన వారంతా చూస్తూ ఫుల్ ఖుష్ అయిపోయారు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతూ 1.64 లక్షల లైకులతో, రకరకాల కామెంట్లతో నెట్టింట దూసుకుపోతోంది. కొందరు బాగా చేశావని కామెంట్ చేస్తుండగా.. ‘సింగిల్ రెహెనే దే’ అంటోంది కాబట్టి పెళ్లి రద్దు చేయండి అంటూ మరికొందరు సరదా సరదాగా రియాక్ట్ అవుతున్నారు.

Video Credits to hd.creation. pictures and 2 othres Insta Id

Advertisement

Next Story

Most Viewed