Brain Fog: ఏకాగ్రతను దెబ్బతీస్తున్న బ్రెయిన్ ఫాగ్.. ఎలా నివారించాలంటే..

by Javid Pasha |   ( Updated:2024-09-25 15:18:17.0  )
Brain Fog: ఏకాగ్రతను దెబ్బతీస్తున్న బ్రెయిన్ ఫాగ్.. ఎలా నివారించాలంటే..
X

దిశ, ఫీచర్స్: బ్రెయిన్ ఫాగ్.. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పలువురిని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఇది కూడా ఒకటి. పనిమీద సరిగ్గా దృష్టి పెట్టలేకపోవడం, ఏకాగ్రత కదరకపోవడం, జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, తీవ్రమైన అలసట, తరచుగా గందరగోళానికి, ఒత్తిడికి గురికావడం దీని లక్షణాలుగా ఉంటాయని వైద్య నిపుణులు చెప్తు్న్నారు. ముఖ్యంగా ఒక వ్యక్తి దీనిబారిన పడితే రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనే సామర్థ్యాన్ని కోల్పోతారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. దీంతో ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశం ఉంటుంది.

ఎందుకు వస్తుంది?

దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా బాధితుల్లో అధిక రక్తపోటు పెరగడం, రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపడంవల్ల బ్రెయిన్‌ఫాగ్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలాగే క్యాన్సర్ చికిత్స తీసుకునే వారిలోనూ రావచ్చు. దీనిని ‘కీమో బ్రెయిన్‌’గా పేర్కొంటారు. ఆహారాల విషయానికి వస్తే అధిక చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా తీసుకోవడం, విటమిన్లలోపం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. స్త్రీలలో అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అధిక రక్తస్రావం, గర్భధారణ, థైరాయిడ్ వంటి ప్రాబ్లమ్స్‌ వల్ల మానసిక ఒత్తిడికి లోనై బ్రెయిన్ ఫాగ్ సమస్యకు దారితీయవచ్చు.

పరిష్కారం ఏమిటి?

బ్రెయిన్ ఫాగ్ సమస్యకు గల కారణాలేమిటో గుర్తించి వాటిని నివారించడం ద్వారా తగ్గుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉండేలా జీవనశైలిని మార్చుకోవాలి. నిద్రలేమి కూడా కారణం కాబట్టి తగినంత నిద్ర పోవడం చాలా ముఖ్యం. అలాగే ఒత్తిడికి గురిచేసే పరిస్థితులను, ఆహారాలకు, మద్యపానం, ధూమపానం, కెఫిన్ వంటి పదార్థాలను అవైడ్ చేయాలి. తాజా పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం వంటి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామాలు చేయడం, సామాజిక పరస్పర చర్యల్లో పాల్గొనడం వంటివి చేయాలి. మిమ్మల్ని అనవసరంగా ఆందోళకు లేదా టెన్షన్‌కు గురిచేసే పరిస్థితులను నివారించాలి. దీంతో క్రమంగా బ్రెయిన్ ఫాగ్ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అలా జరగకపోతే గనుక డాక్టర్లను సంప్రదించి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

Next Story

Most Viewed