అబ్బాయిలు ఈ లక్షణాలున్న అమ్మాయిలను కోరుకుంటారు.. అవేంటంటే..?

by Sumithra |
అబ్బాయిలు ఈ లక్షణాలున్న అమ్మాయిలను కోరుకుంటారు.. అవేంటంటే..?
X

దిశ, ఫీచర్స్ : వివాహం ఇద్దరు వ్యక్తులను కలిపే పవిత్రమైన వేడుక. మూడు ముళ్లు, ఏడు అడుగులు, వేదమంత్రాలతో ఇద్దురు మనుషులు ఒక్కటయ్యే పవిత్రబంధం వివాహం.. అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహానికి ముందు తన జీవిత భాగస్వామి గురించి ఎన్నో కళలను కంటారు. వారితో గడపబోయే జీవితం గురించి ఎన్నో ఆలోచనలు చేస్తారు. వివాహానికి ముందు తన జీవిత భాగస్వామి అందాన్ని చూసి ఆకర్షితులవుతారు. మరికొంత మంది గుణగణాలను పరిశీలిస్తారు. ముఖ్యంగా అబ్బాయిల విషయానికొస్తే తనకు కాబోయే భార్య ఎలా ఉండాలో కొన్ని అంచనాలు వేసుకుంటారు. తన జీవిత భాగస్వామిలో ఉండే అన్ని గుణాలను గమనిస్తారు. ఇంతకీ అబ్బాయిలు ఎలాంటి గుణాలు ఉన్న అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకుంటున్నారో ఇప్పుడు చూద్దాం..

కుటుంబాన్ని ప్రేమించడం

తన జీవిత భాగస్వామి వారి కుటుంబాన్ని అర్థం చేసుకుని మెదిలితే ఎక్కువగా ఇష్టపడతారు. తనను, తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటారు. తాను ఉన్నాలేకున్నా వారి కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకుంటారని భరోసాతో ఉంటారు.

తనను తాను చూసుకోవాలి..

తనకు కాబోయే భార్య ఇతరుల భార్య కన్నా అందంగా, అణుకువగా ఉండాలని ఆశ పడతారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకుంటూ, అమితంగా ఇష్టపడాలని కోరుకుంటారు. తనను తాను జాగ్రత్తగా చూసుకుంటూ, తన కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని అనుకుంటారు. ఇలాంటి అమ్మాయిలను పెళ్లిచేసుకోవాలని అబ్బాయిలు ఆశపడతారు.

విశ్వాసంగా ఉండాలి

తన కుటుంబంలో వచ్చే అమ్మాయి నమ్మకంగా, నిజాయితీగా ఉండాలనుకుంటారు. ప్రతి విషయాన్ని తన భార్య తనతో పంచుకోవాలనుకుంటారు. అలాంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలని అబ్బాయిలు భావిస్తారు.

ఆత్మవిశ్వాసంతో ఉండాలి

ఆత్మవిశ్వాసంతో ఉండే అమ్మాయిలను అబ్బాయిలు కోరుకుంటారు. తన ప్రవర్తనతో అందరినీ ఆకట్టుకోగలగాలి అనుకుంటారు. ఎంతటి కష్టకాలంలో అయినా ఆత్మస్థైర్యంతో ఉండాలనుకుంటారు. పురుషులు ఇలాంటి వారినే భార్యలుగా కోరుకుంటారు.

Advertisement

Next Story

Most Viewed