- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగ పీతలను ఆడవాటిగా మారుస్తున్న పరాన్నజీవి.. గుడ్లను మోసేందుకు..
దిశ, ఫీచర్స్: బార్సాకిల్ జాతికి చెందిన పరాన్నజీవి సాక్యులినా కార్సిని.. సంతానోత్పత్తి ప్రక్రియ కోసం పీతలను వాడుకుంటోంది. మగ ఎండ్రకాయలను బలవంతంగా కాస్ట్రేటింగ్(వృషణాలను తొలగించడం) చేసి ఏకంగా లింగాన్ని మార్చేస్తుంది. వాటి గుడ్లను చూసుకునేందుకు, విడుదల చేసేందుకు ఇష్టపడే ఆడ ఎండ్రకాయలుగా చేంజ్ చేస్తుంది. గ్రీన్ క్రాబ్స్ మాత్రమే ఈ పారాసైట్‌కు బలి అవుతుండగా.. ముందుగా పీతలకు అత్యంత హాని కలిగించే భాగంలోని వెంట్రుకలలో ‘వర్మిగాన్’గా పిలువబడే మైక్రోస్కోపిక్ డ్రాప్‌ను ఇంజెక్ట్ చేస్తుంది. ఈ బొట్టే పరాన్నజీవి బార్సాకిల్‌గా పెరుగుతుంది.
పరిపక్వ పరాన్నజీవి అంతర్గత భాగం.. ఎండ్రకాయ శరీరం అంతటా వ్యాపించి, రూట్ లాంటి టెండ్రిల్స్ వ్యవస్థ వలె కనిపిస్తుంది. ఈ టెండ్రిల్స్ ద్వారానే పరాన్నజీవి పోషణను పొందుతుంది. పీత యొక్క నాడీ వ్యవస్థకు అతుక్కుని దాని ప్రవర్తనను నియంత్రిస్తుంది. ఈ క్రమంలో మగ పీతలు శరీరంలో లైంగిక లైంగిక మార్పులను పొందుతాయి. గోనాడ్‌లను కోల్పోయిన మేల్ క్రాబ్స్.. కాలక్రమేణా అండాశయ కణజాలాన్ని అభివృద్ధి చేస్తాయి. పొత్తికడుపు వెడల్పుతో సహా ఇతర స్త్రీ లక్షణాలను పొందుతాయి.
మొత్తానికి ఆడ, మగ పీతలు తమకు తెలియకుండానే సక్యులినా కార్సిని గుడ్లను తమ పొత్తికడుపుకు జోడించిన సంచిలో విడుదలకు సిద్ధంగా ఉండే వరకు తీసుకువెళతాయి. గుడ్లు మగ లార్వాల ద్వారా ఫలదీకరణం చెందుతాయి. ఇవి ఒక రంధ్రము ద్వారా సంచిలోకి ప్రవేశిస్తాయి. ఆసక్తికరంగా ఆడ పీతలు పరాన్నజీవి గుడ్లను తమ సొంత సంతానం వలె చూసుకుంటాయి. ఇక పునరుత్పత్తి అవయవాలను ఉత్పత్తి చేసుకోవడాన్ని పరాన్నజీవి నిరోధించడంతో.. మగ ఎండ్రకాయల్లో లైంగిక మార్పు శాశ్వతంగా ఉండిపోతుంది.
Also Read..