బ్లాక్ ఉమెన్ ఎక్కువగా ఆపరేషన్ ద్వారా పిల్లలను కంటున్నారు... డాక్టర్లు కావాలనే చేస్తున్నారా? ఎందుకు?

by Sujitha Rachapalli |
బ్లాక్ ఉమెన్ ఎక్కువగా ఆపరేషన్ ద్వారా పిల్లలను కంటున్నారు...  డాక్టర్లు కావాలనే చేస్తున్నారా? ఎందుకు?
X

దిశ, ఫీచర్స్ : ప్రెగ్నెన్సీ స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే డెలివరీ అయ్యేంత వరకు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూనే ఉండాల్సి వస్తుంది. కాంప్లికేషన్స్ అంటూ భయపెడుతుంటే లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే తాజాగా న్యూయార్క్ అధ్యయనం ఓ వాస్తవాన్ని గుర్తించింది. నల్ల జాతి, శ్వేత జాతి గర్భిణుల మధ్య కావాలనే తేడా చూపుతున్నారని తేలింది. ఒకే రకమైన ప్రెగ్నెన్సీ జర్నీ ఉన్నా సరే బ్లాక్ ఉమెన్ కు నార్మల్ డెలివరీ కన్నా C- సెక్షన్ చేసేందుకే మొగ్గు చూపుతున్నారని తెలిపింది. దీనివల్ల శస్త్ర చికిత్స గాయాలతో జీవితాంతం బాధ పడుతున్నారని వెల్లడించింది.

న్యూజెర్సీలోని 68 ఆసుపత్రులలో దాదాపు ఒక మిలియన్ జననాలకు సంబంధించిన కొత్త నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది పూర్తిగా పక్షపాతమని స్పష్టం చేసింది. తెల్ల జాతి స్త్రీతో పోలిస్తే నల్లజాతి తల్లి తన బిడ్డను సి-సెక్షన్ ద్వారా పొందే అవకాశం దాదాపు 25% ఎక్కువగా ఉందని కనుగొంది. ఈ సర్జరీలు ఖరీదైనవి కాబట్టి.. వైద్యులకు ఆసుపత్రుల అధిక చెల్లింపులతో ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం కూడా కారణం కావచ్చని పేర్కొంది. కాగా దీనిపై అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నిపుణులు.. నల్లజాతి స్త్రీలు ప్రసవించే ముందు ప్రసూతి వైద్యునితో డెలివరీ ఎంపికలను సమీక్షించాలని సూచిస్తున్నారు.

Advertisement

Next Story