Trending: యూట్యూబ్ చూసేవారికి బిగ్‌ షాక్..! SUBSCRIBE చేసేముందు ఇది తెలుసుకోండి!

by Javid Pasha |
Trending: యూట్యూబ్ చూసేవారికి బిగ్‌ షాక్..! SUBSCRIBE చేసేముందు ఇది తెలుసుకోండి!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఇష్టపడే మోస్ట్ కమ్యూనికేషన్‌ అండ్ ఎంటర్టైన్మెంట్ వేదిక ఏదైనా ఉందంటే అది యూట్యూబ్ మాత్రమే. ఒక విధంగా చెప్పాలంటే ఈ రోజుల్లో దీనిని చూడనివారంటూ ఎవరూ ఉండరు. ఎంతో మంది యూట్యూబ్ ఛానళ్లను రన్ చేస్తూ ఆదాయం పొందుతున్నారు. అనేకమంది వాటిని Subscribe చేసుకోవడం ద్వారా వినోదాన్ని, అవసరమైన సమాచారాన్ని పొందుతున్నారు. అలాంటివారికో షాకింగ్ న్యూస్. ఏంటంటే.. యూట్యూబ్ ఇప్పుడు తన ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ రేట్లను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు దేశాల్లో అమలవుతుండగా.. త్వరలో భారత్‌లో కూడా పెరిగిన ధరలు అమలు చేయనున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే సౌత్ అమెరికా, ఐరోపా, ఆసియా దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ధరలు మారాయి. ఇక కొలంబియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, బెల్జియం, ఐర్లాండ్, ఇండోనేషియా, ఇటలీ, మలేషియా, నెదర్లాండ్స్, సౌదీ అరేబియా, నార్వే, సింగపూర్, స్వీడన్, థాయ్ లాండ్, స్విడ్జర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోనూ కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. ఓ నివేదిక ప్రకారం.. నార్వేలో ఈ సబ్ స్క్రిప్షన్ ధరలు ఎక్కువగా పెరిగాయి. ఇంతకు ముందు నెలకు రూ. 950 ఉంటే ఇప్పుడది రూ. 1,340కి పెరిగింది. ఇక స్వీడన్‌లో ఫ్యామిలీ సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా పెరిగాయట. ఇక్కడ సింగిల్ ప్లాన్‌ను 18 శాతం, ఫ్యామిలీ ప్లాన్‌ను 43 శాతం పెంచినట్లు తెలుస్తోంది.

వివిధ దేశాల్లో యూట్యూబ్ ప్రీమియం కొత్త ప్లాన్‌లు అమలవుతున్న నేపథ్యంలో ఇండియాలో అమలు కానున్న ధరల గురించి కూడా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం.. ఇక్కడి Subscribers కొత్తగా అమలులోకి వచ్చే ధరల ప్రకారం.. నెలకు ఇప్పటి వరకు ఉన్న రూ.129కి బదులు రూ.149 చెల్లించాల్సి వస్తుంది. స్టూడెంట్స్ అయితే రూ.79కి బదులు రూ. 89 చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఫ్యామిలీ ప్లాన్ సబ్‌స్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకుంటే గనుక రూ.189కి బదులు రూ. 299 చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మంత్లీ పర్సనల్ ప్లాన్ తీసుకునే యూజర్స్ రూ.139కి బదులుగా రూ. 159 చెల్లించాలి. అదే మూడునెలలకు అయితే రూ. 399 కి బదులు రూ. 459, ఏడాదికైతే రూ.1290కి బదులు రూ. 1490 చెల్లించాల్సి ఉంటుంది.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అందులోని అంశాలకు సంబంధించి ‘దిశ’ బాధ్యత వహించదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed