- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Money savings effect : డబ్బులు పొదుపు చేసే అలవాటుతో మెరుగైన నిద్ర.. మానసిక ప్రశాంతత కూడా!
దిశ, ఫీచర్స్ : మీకు ప్రశాంతంగా నిద్రపట్టడం లేదా? వివిధ సమస్యలతో సతమతం అవుతున్నారా?.. అయితే ఇక నుంచి డబ్బులు పొదుపు చేయడం ప్రారంభించండి! ఎందుకంటే.. ఈ అలవాటు మీలో మెరుగైన నిద్రను ప్రోత్సహిస్తుందని, మానసిక ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తుందని ఓ కొత్త అధ్యయనంలో వెల్లడైంది. అలాగనీ ప్రతిరోజూ డబ్బెక్కడి నుంచి తేవాలని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతీనెల మీకు వచ్చే జీతం లేదా ఆదాయంలోంచే ఎంతో కొంత జమ చేస్తే చాలు.
వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం అంటున్నారు బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. పొదుపు అలవాట్లు వ్యక్తులను ఏ విధంగా ప్రభావితం చేస్తాయో తెలుసుకునేందుకు పదేళ్లపాటు కొందరిపై తాము నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు వారు పేర్కొన్నారు. ఎవరైతే ప్రతీనెల కొంత పొదుపు చేస్తారో, అలా పొదుపు చేయని వారితో పోలిస్తే మెరుగైన మానసిక స్థితిని కలిగి ఉంటారని గుర్తించారు. ఆదాయం ఎక్కువ, తక్కువలతో సంబంధం లేకుండా వచ్చే దానిలో నుంచే కొంత పక్కన పెట్టడంవల్ల ఇలా జరుగుతుందట. ఆపద సమయంలో, అత్యవసర పరిస్థితిలో పొదుపు చేసిన డబ్బు కాపాడుతుందనే ఫీలింగ్ సదరు వ్యక్తుల మానసిక స్థితిపై సానుకూల ప్రభావం చూపుతుందని అధ్యయనంలో పాల్గొన్న నిపుణులు చెప్తున్నారు. పొదుపు అలవాటు సంతోషాన్ని, సంతృప్తిని కలిగిస్తోందని, తద్వారా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని రీసెర్చర్స్ అంటున్నారు.
వాస్తవానికి ఆర్థిక ఇబ్బందులు, అప్పులు జీవితంలో మనశ్శాంతిని దూరం చేస్తాయి. అంతేకాకుండా వివిధ అవసరాలకు ఏం చేయాలనే ఆలోచన కూడా మరింత ఆందోళనకు గురిచేస్తుందని, బాధిత వ్యక్తులను నిద్రకు దూరం చేస్తుందని పరిశోధకులు అంటున్నారు. అయితే వచ్చిన కొద్దిపాటి జీతం లేదా ఆదాయం అయినా సరే అందులోంచి కొంత పొదుపు చేయడం ప్రారంభిస్తే తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇది జీవితంలో సంతృప్తిని, సంతోషాన్ని కలిగించడంవల్ల మెరుగైన మానసిక స్థితికి, ప్రశాంతమైన నిద్రకు దారితీస్తుందని నిపుణులు చెప్తున్నారు.