- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెర్లిన్ హిస్టరీ.. ఆడియో గైడ్ ద్వారా ప్రచారం చేస్తున్న సెక్స్ వర్కర్స్
దిశ, ఫీచర్స్: బెర్లిన్ సెక్స్ వర్కర్లు తమ వృత్తి కళంకం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. 'berlinHistory' యాప్ సహాయంతో 'వి హావ్ ఆల్వేస్ బీన్ ఎవ్రీవేర్' పేరుతో ఆడియో గైడ్‌ను ప్రారంభించారు. స్థానిక అధికారులు, ష్వూల్స్ LGBTQ మ్యూజియం సహాయంతో సెక్స్ ఇండస్ట్రీ సభ్యులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జర్మనీ 2002లో సెక్స్ వర్క్‌ను చట్టబద్ధం చేయగా.. దేశవ్యాప్తంగా దాదాపు 24,000 మంది పరిశ్రమలో పనిచేస్తున్నట్లు నమోదు చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత అంచనా ప్రకారం 400,000 మంది కార్మికులు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ వెలుపల పనిచేస్తున్నారు. వారిలో చాలామంది వలస మహిళలు, మానవ అక్రమ రవాణా, వ్యవస్థీకృత నేరాల బాధితులు ఉన్నారు.
అయితే జర్మనీలో సెక్స్ వర్క్‌పై సాపేక్షంగా ఉదారవాద చట్టాలు ఉన్నప్పటికీ, నిర్బంధ రిజిస్ట్రేషన్ నిబంధనల కారణంగా చాలా మంది పరిశ్రమ కార్మికులు గుర్తించబడరు. మానవ హక్కుల సంస్థల ప్రకారం, ఇది చట్టవిరుద్ధంగా పని చేసేవారిని అండర్ గ్రౌండ్‌కు వెళ్లేలా చేస్తుంది. కానీ ఈ ఆడియో గైడ్ సెక్స్ వర్కర్లు తమ వృత్తిని సాధారణీకరించడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నారు. ఈ హిస్టారికల్ ప్రాజెక్ట్.. భవిష్యత్తు కథనాన్ని మార్చుతుందని నమ్ముతున్నారు. తరతరాలుగా ఇక్కడే ఉన్నా.. ఇన్నాళ్లుగా గుర్తించబడకుండా, లైంగికంగా వేధింపులు ఎదుర్కొన్న తాము.. ఈ ప్రాజెక్ట్‌తో సురక్షితంగా పనిచేసేసుకునేందుకు అర్హులుగా మారినందుకు సంతోషంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో నగరంలోని ప్రఖ్యాత రెడ్ లైట్ డిస్ట్రిక్ట్‌లో వాకింగ్ టూర్ గైడ్ చేయబడుతున్నందున వినియోగదారులు జర్మన్ రాజధాని వాణిజ్య చరిత్రను కనుగొనగలరు.
READ MORE