- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యాలకులతో బీపీ కంట్రోల్
దిశ, ఫీచర్స్: యాలకులు లేదా ఇలాచి ' క్వీన్ ఆఫ్ స్పైసెస్ ' గా కీర్తించబడుతుంది. ప్రత్యేకమైన ఫ్లేవర్ మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యంలో ఉపయోగించబడుతుంది. కాగా ఈ అరొమాటిక్ స్పైస్ మనకు ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ అందిస్తుందో చెప్తున్న నిపుణులు.. తరుచుగా వినియోగించడం మంచిదని సూచిస్తున్నారు.
జీర్ణక్రియ : యాలకులు జీర్ణక్రియను స్టిమ్యులేట్ చేస్తాయి. ఉబ్బరం, గ్యాస్ లాంటి అసౌకర్యాలను తగ్గిస్తాయి. పూర్తి డైజెస్టివ్ హెల్త్ ను కాపాడుతాయి.
తాజా శ్వాస : ఇలాచిలో నేచురల్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. వీటిని తరచుగా రోజుకొకటి తీసుకున్నా చెడు శ్వాస నుంచి విముక్తి కలుగుతుంది. దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
బాడీ డిటాక్సీఫైర్: యాలకులు సహజమైన డిటాక్సీఫైర్ గా పని చేస్తాయి. మందు, డ్రగ్స్ కారణంగా శరీరంలోకి ప్రవేశించిన విషపూరిత పదార్థాలను బయటకు పంపిస్తాయి. వ్యర్థాలను రిమూవ్ చేయడం ద్వారా లివర్ హెల్త్ కు సపోర్ట్ చేస్తాయి.
మెటబాలిజం : ఆహారంలో వీటిని చేర్చుకోవడం వల్ల మెటబాలిజం వృద్ధి చెందుతుంది. సరైన బరువు మెయింటైన్ చేయడంలో, కొవ్వు తగ్గించడంలో సహాయపడుతుంది.
బీపీ కంట్రోల్ : పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్న ఇలాచి.. బీపీని కంట్రోల్ చేస్తుంది. హై బీపీ తగ్గించి.. గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉచ్చుతుంది.
చర్మ ఆరోగ్యం : తరుచుగా యాలకులు తీసుకున్నట్లయితే స్కిన్ హెల్త్ కూడా బాగుంటుందని చెప్తున్నారు నిపుణులు. మొటిమలు, మచ్చలను తగ్గించి.. స్కిన్ గ్లో పెంచుతుంది. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కలిగిస్తుంది.
నోట్ : పైన ఇచ్చిన కంటెంట్ నిపుణులు ఇంటర్నెట్ లో పంచుకున్నది మాత్రమే.