- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పడుకునే ముందు కాళ్లు కడుక్కుంటున్నారా.. జరిగేది ఇదే..
దిశ, వెబ్ డెస్క్ : ప్రతిరోజు మనం ఎన్నోపనుల మీద బయట తిరుగుతూ ఉంటాం. కొంత మంది ఇంటికి రాగానే ముందు కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వస్తారు. మరికొంత మంది మాత్రం కాళ్లు కడగకుండానే ఇంట్లోకి వచ్చేస్తారు. బయటికి వెళ్లివచ్చినప్పుడు కాళ్లు కడుక్కోకపోతే దరిద్రం చుట్టుకుంటుంది అని పెద్దవారు అనేవారు. అందుకే బయటికి వెలితే ఖచ్చితంగా కాళ్లు కడిగాకనే ఇంటిలోపలికి రావాలంటారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం రాత్రివేళ కాళ్లు కడగడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు పెద్దలు. మరి ఆ ప్రయోజనాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం..
చాలా మంది పాదాలు ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు వేడిగా ఉంటాయి. అలాంటివారు రాత్రిల్లు పాదాలు శుభ్రం చేసుకుంటే పాదాలలో ఉష్ణోగ్రత సమతుల్యంగా ఉంటుంది. రాత్రిపూట గోరువెచ్చటి నీటితో లేదా సాధారణ ఉష్ణోగ్రత ఉన్న నీటితో కాళ్లు కడిగితే పాదాలలో ఉండే బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. దాంతో పాదాలు సురక్షితంగా ఉంటాయి. ఎప్పుడూ పాదాలకు చెమటలు పట్టేవారు ఈ పద్దతిని ఖచ్చితంగా పాటించాలి.
అధిక బరువు ఉన్నవాల్లకి, లేదా నిత్యం అటూ ఇటూ నడిచేవారికి రాత్రి సమయంలో కాళ్లు తిమ్మిర్లు రావడం, కాళ్లలో పట్టుకోల్పోవడం, నరాలు బిగుసుకు పోవడం, కండరాలు, ఎముకల్లో నొప్పులు రావడం లాంటివి జరగవచ్చు. అలాంటి సమయంలో గోరువెచ్చటి నీటితో పాదాలను, కాళ్లను కడిగితే కాస్త చాలా ఉపశమనం లభిస్తుంది. లేదా గోరువెచ్చని నీటిని ఒక బకెట్‌లో తీసుకుని కాసేపు అందులో పాదాలు పెడితే చాలా రిలాక్స్ గా ఉంటుంది.
Read More: మిమ్మల్ని యవ్వనంగా మరియు ఆరోగ్యంగా ఉంచే అలవాట్లు ఇవే!