- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సూర్యరశ్మితో లాభాలు.. సమృద్ధిగా అందుతున్న Vitamin D (విటమిన్ డి)
దిశ, ఫీచర్స్: ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో సూర్యరశ్మిని ఆస్వాదించమని సూచిస్తున్నారు నిపుణులు. రోజూ ఎండలో ఉండటం మూలంగా డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరే రాదంటున్న ఎక్స్‌పర్ట్స్.. వాపు, బాధాకరమైన కీళ్ళు, ఆర్థరైటిస్ నొప్పి ఉన్నవారికి సన్ ఎక్స్‌పోజర్ హెల్ప్ చేస్తుందని సూచిస్తున్నారు. శరీరానికి విటమిన్ డి తగినంతగా అందకపోతే ఎముకలు బలహీనపడతాయి. కీళ్ళ నొప్పులు వస్తాయి. పిల్లలలో ఎముకలు సరిగ్గా ఏర్పడక రికెట్స్ వ్యాధికి దారితీస్తుంది. ఇలాంటప్పుడు విటమిన్ డి ఉత్పత్తిని పెంచే సామర్ధ్యం కలిగిన సూర్యరశ్మికి బహిర్గతం కావాలని.. దీనివల్ల మానసిక స్థితి, సరైన నిద్ర, అధిక శక్తి కలుగుతుందని వివరిస్తున్నారు.
సన్‌లైట్ ఇన్‌స్టిట్యూట్ ప్రకారం, ఆల్ట్రావాయిలెట్-బి అనేది చర్మంలో మంటను అణచివేయడం వంటి అనేక ప్రభావాలు కలిగిన సన్‌లైట్ స్పెక్ట్రం. ఇది తామర మరియు సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులకు చికిత్స చేయడానికి ఉపయోగించబడుతుంది. అందుకే తెల్లవారుజామున లేదా సాయంత్రం సూర్యరశ్మికి కనీసం ఐదు నిమిషాలైన ఎక్స్‌పోజ్ కావాలి. ఈ సమయాన్ని క్రమంగా 15 నిమిషాల వరకు పెంచుకోవచ్చు.
ప్రత్యామ్నాయం పరారుణ కిరణాలు
చల్లని దేశంలో నివసిస్తున్నప్పుడు, సూర్యరశ్మికి ప్రవేశం లేనప్పుడు పరారుణ దీపం(ఇన్‌ఫ్రారెడ్ ల్యాంప్)ను ప్రయత్నించండి. ఈ పరారుణ కిరణాలు కీళ్లనొప్పులు, శీతాకాలంలో అనుభవించే మంటను తగ్గిస్తాయి. నాన్-ఇన్వాసివ్ ఫార్-ఇన్‌ఫ్రారెడ్ కిరణాలు డయాబెటిస్ మెల్లిటస్, కార్డియోవాస్కులర్ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్న రోగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
జర్నల్ ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అండ్ ఫోటోబయాలజీ ప్రకారం.. వైద్య చికిత్స కోసం ఫార్-ఇన్‌ఫ్రారెడ్ సానాస్ ఉపయోగించడం అనేది రేడియేషన్ చర్మంలో లోతుగా చొచ్చుకపోవడంపై ఆధారపడి ఉంటుంది. ఇది థర్మల్ రెగ్యులేషన్ యొక్క హోమియోస్టాసిస్‌ను పునరుద్ధరిస్తుంది. కార్డియోవాస్కులర్, శ్వాసకోశ సమస్యలు లేదా ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న నిశ్చల రోగులలో, మితమైన వ్యాయామానికి ప్రత్యామ్నాయంగా ఎంపిక చేయబడుతుంది. ఇవి చికిత్సా ప్రభావాలను ఉత్పత్తి చేస్తాయి. బరువు తగ్గడం, హార్ట్ ఫెయిల్యూర్, ప్రీమెచ్యూర్ వెంట్రిక్యులర్ కాంట్రాక్షన్స్, క్రానిక్ ఫెటీగ్‌పై కూడా ఎటువంటి ప్రతికూల ప్రభావాలు లేవు.