- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తమలపాకులు నమిలితే కలిగే ప్రయోజనాలివే.. ఆ తప్పు మాత్రం చేయొద్దు !
దిశ, ఫీచర్స్ : భారతదేశంలో మతపరమైన ఆచారాలలో తమలపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రత్యేక సందర్భాల్లో, పండగలకు, పూజలలో దేవతామూర్తులకు ఈ తమలపాకులతోనే అభిషేకం చేస్తారు. అంతే కాదు ఏదైనా దోష నివారణ కోసం, అలాగే ప్రతి మంగళవారం హనుమంతునికి తమలపాకు మాలలు వేసి ఆరాధిస్తారు. పూజలలో మాత్రమే కాకుండా భోజనం తర్వాత పాన్ ( తాంబూలం ) వేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది.
ఈ తమలపాకులు నమిలితే అనారోగ్య సమస్యలు తొలగుతాయని నిపుణులు చెబుతున్నారు. అందులో ఉండే థయామిన్, నియాసిన్, విటమిన్ సి, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాదు రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. తమలపాకుల్లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. అలాగే తమలపాకులను దంచి పేస్ట్ లాగా చేసి నీటిలో రాత్రంతా ఉంచి ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగాలి. అప్పుడు ప్రేగు కదలికలు సులభతరం అవుతాయని నిపుణులు చెబుతున్నారు.
అదే కాక యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు ప్రతి రోజు తమలపాకులను తింటే ఆ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతారు. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ పెటొచ్చు. అలాగే తమలపాకులో ఉండే యాంటీ మైక్రోబయల్ ఏజెంట్లు నోటి దుర్వాసనను తొలగిస్తాయి. దంతాల సమస్యలు కూడా నివారిస్తుంది. అందుకే భోజనం తర్వాత కొన్ని తమలపాకులను నమలడం మంచిదని నిపుణుల అభిప్రాయం. తమలపాకులు ఆస్తమా, ఛాతీ, ఊపిరితిత్తుల రద్దీతో బాధపడేవారికి ఇది మంచి ఔషధం. దగ్గు, జలుబుకు సంబంధించిన సమస్యలకు మంచి మందుగా ఉపయోగిస్తారు.