Water Bottle : మీ వాటర్ బాటిల్ చివరగా ఎప్పుడు కడిగారు.. ఈ విషయంలో జాగ్రత్త.. లేదంటే..

by Sujitha Rachapalli |
Water Bottle : మీ వాటర్ బాటిల్ చివరగా ఎప్పుడు కడిగారు.. ఈ విషయంలో జాగ్రత్త.. లేదంటే..
X

దిశ, ఫీచర్స్ : మనం రోజూ వాటర్ బాటిల్స్ వాడుతుంటాం. చూసేందుకు నీట్ గా ఉంటాయి.. పైగా అందులో పట్టేది నీరు మాత్రమే కాబట్టి కడగాల్సిన అవసరం లేదనే ఫీలింగ్ లో చాలా మంది ఉండిపోతారు. కానీ ఇలాంటి నిర్లక్ష్యం పనికి రాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. లేదంటే సాల్మొనెల్లా, ఇ కొలి బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. నీరు కాకుండా జ్యూస్ లేదా శీతల పానీయాల కోసం వాడినప్పుడు ప్రతిరోజూ వాటర్ బాటిళ్లను సబ్బు నీటితో కడగడం మంచిదని సూచిస్తున్నారు. లేదంటే వారానికి ఒకసారి చాలని చెప్తున్నారు.

ప్లాస్టిక్ బాటిల్స్ విషయానికి వస్తే.. వీటిని వేడి నీరు లేదా రసాయన డిటర్జెంట్స్ తో క్లీన్ చేసేందుకు ట్రై చేస్తే పాడైపోతాయని గుర్తుంచుకోమంటున్నారు. ఇక గాజు సీసాలు కొంత వరకు వేడిని తట్టుకోగలవు. అయితే స్టెయిన్లెస్ స్టీల్స్ కొన్నిసార్లు బ్లీచ్, క్లోరిన్ వంటి రసాయనాలతో చర్య జరిపినప్పుడు.. పాత్ర లోపలి భాగాలకు హాని కలగవచ్చు. కాబట్టి బాటిల్ మెటీరియల్ ను బట్టి క్లీనింగ్ స్టఫ్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.

Advertisement

Next Story

Most Viewed