గాయాలకు వేసే బ్యాండేజ్‌తో క్యాన్సర్.. నల్లగా ఉన్న వాళ్లే టార్గెట్.. ఈ బ్రాండ్స్ అస్సలు వాడొద్దు

by Sujitha Rachapalli |
గాయాలకు వేసే బ్యాండేజ్‌తో క్యాన్సర్.. నల్లగా ఉన్న వాళ్లే టార్గెట్.. ఈ బ్రాండ్స్ అస్సలు వాడొద్దు
X

దిశ, ఫీచర్స్ : సాధారణంగా చిన్న గాయం కాగానే వెంటనే బ్యాండేజ్ వేస్తుంటాం. సింపుల్ గా హీల్ అయిపోతుందని అనుకుంటాం. కానీ వీటిని ఉపయోగించడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తుంది తాజా అధ్యయనం. వీటిలో ఉండే ఫరెవర్ కెమికల్స్(PFAS)ఇందుకు కారణం కాగా రోగనిరోధక వ్యవస్థ పనితీరు, వ్యాక్సిన్ రియాక్షన్, పిల్లల్లో డెవలప్మెంట్ డిజార్డర్ సమస్యలు, సంతానోత్పత్తిపై కూడా ఎఫెక్ట్ చూపుతున్నాయని వెల్లడించింది.

Mamavation, ఎన్విరాన్‌మెంట్ అండ్ హెల్త్ న్యూస్ నిర్వహించిన తాజా అధ్యయనం 40 వేర్వేరు బ్యాండేజ్‌లు, 18 బ్రాండ్‌లను పరిశీలించింది. బ్యాండ్-ఎయిడ్, కురాడ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లలో కూడా ఫరెవర్ కెమికల్స్ ఉన్నాయని గుర్తించింది. దాదాపు 26 బ్యాండేజ్‌లలో ఆర్గాన్ ఫ్లోరిన్ లెవెల్స్ 11 పార్ట్స్ పర్ మిలియన్ నుంచి 239 ppm వరకు ఉన్నాయని తెలిపారు శాస్త్రవేత్తలు. వీటిని ఓపెన్‌గా ఉన్న గాయాలకు వేయడం ద్వారా ఫరెవర్ కెమికల్స్ రక్తప్రవాహంలోకి ఎంటర్ అవుతున్నాయని, దీనివల్ల హెల్త్ రిస్క్ లో పడుతుందని వివరించారు. ఇక వీటిలో 63శాతం బ్యాండేజ్ లు బ్లాక్, బ్రౌన్ కలర్ స్కిన్ టోన్ కలిగిన ప్రజలకే ఈ కంపెనీలు అమ్మినట్లు కూడా స్టడీ గుర్తించింది.

Advertisement

Next Story

Most Viewed