- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
'బహు వచనం' అంటే అత్తమామలు చెప్పిన మాటలు వినే కోడలు.. పరీక్షలో విద్యార్థి ఆన్సర్ చూస్తే నవ్వు ఆపుకోలేరు.
దిశ, ఫీచర్స్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఏం చేసిన వైరల్ అవుతున్నాయి. కొత్తగా కొంచెం కనిపిస్తే చాలు అది నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఆ కోవకు చెందిన ఓ వీడియో బాగా నవ్వులు పూయిస్తోంది.
వివరాల్లోకి వెళితే.. ఓ హిందీ పరీక్షకు విద్యార్థి రాసిన హాస్యభరిత జవాబులతో కూడిన ఒక పేపర్‌ను @n2154j పేరుతో ఉన్న ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్టు చేశారు. అయితే ఆ పరీక్ష ఏ రాష్ట్రంలో జరిగిందనే వివరాలు వెల్లడించలేదు. ఇంతకూ ఆ పేపర్‌లో ఉన్న ప్రశ్నలు ఏమిటో.. వాటికి విద్యార్థి ఇచ్చిన జవాబులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.'సంయుక్త హల్లును రాయండి (సంయుక్త్ వ్యంజన్ లికియే)' అని టీచర్ ఇచ్చిన ప్రశ్నకు విద్యార్థి 'మటర్ పనీర్‌తో అన్ని కూరగాయల మిక్స్‌తో కలిపి సంయుక్త వంటకం (మటర్ పనీర్ ఔర్ సబీ మిక్స్ సబ్జియాం సంయుక్త్ వ్యంజన్ హోతీ హై)' అవుతుంది' అని రాశాడు. 'భూత కాలం అని దేనిని అంటారు (భూత్ కాల్ కిసే కహ్తే హై..?)' అన్న మరో ప్రశ్నకు భూతం మన కాలం రూపంలో వచ్చినప్పుడు దాన్ని భూత కాలం అంటారు(జబ్ భూత్ హమారా కాల్ బన్‌కర్ ఆతా హై తో ఉసే భూత్‌కాల్ కహ్తే హై)' అని విద్యార్థి నవ్వాపుకోలేని సమాధానం ఇచ్చాడు.
అదేవిధంగా 'బహువచనం అని దేనిని అంటారు..? (బహు వచన్ కిసే కహ్తే హై..?)' అని టీచర్ ఇచ్చిన మూడో ప్రశ్నకు.. 'అత్తమామల మాటలు వినే కోడలును బహువచనం అంటారు (ససూరాల్ కో వచన్ సున్‌నే వాలీ బహు కో బహువచన్ కహ్తే హై)' అని విద్యార్థి సమాధానం రాశాడు. అయితే ఈ మూడు జవాబులకు 10 మార్కులు ఉండగా టీచర్ 5 మార్కులు వేసి 'ఈ 5 మార్కులు నీ తెలివికి బిడ్డా' అని టీచర్ ఆన్సర్ షీట్ పై రాశారు. కాగా ఈ పోస్టు సోషల్ మీడియాలో పెట్టిన కాసేపటికే వైరల్‌గా మారింది. నెటిజన్‌ల నుంచి పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు కుప్పతెప్పలుగా వస్తున్నాయి.