- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Health tips: డెయిలీ హ్యాబిట్స్‌తో అనారోగ్యం..
దిశ, ఫీచర్స్: ప్రతీ మనిషికి సపరేట్ హ్యాబిట్స్ ఉండటం కామన్ కానీ అవి శరీరానికి హాని కలిగిస్తున్నాయని తెలిసినా సరే స్టాప్ చేసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు. దీర్ఘకాలిక అనారోగ్యానికి దారితీస్తున్నా వారి లైఫ్ స్టైల్‌ను మార్చుకునేందుకు ఇష్టపడరు. ఈ లిస్ట్‌లో చాలా హ్యాబిట్స్ ఉండగా.. అవి ఏంటి? ఎలాంటి ప్రమాదాన్ని కొనితెస్తున్నాయి? చూద్దాం.
* హ్యాండ్ డ్రైయర్
సాధారణంగా వాష్ రూమ్‌లలో హ్యాండ్ డ్రైయర్‌లు ఉంటాయి. ఇవి తడి చేతులను తొందరగా ఆరబెట్టి సూక్ష్మక్రిములను నివారిస్తాయని అనుకుంటాం కానీ అలా చేయడం వల్ల డ్రైయర్‌లు చేతుల్లో 40-60 కాలనీస్ బ్యాక్టీరియాను బహిర్గతం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి చేతులను సాధారణ టవల్ లేదా శానిటైజర్‌లతో శుభ్రం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
* చెవిలో వేలు పెట్టుకోవడం
చెవిలో చిన్న దురద పెడితే వెంటనే చేతి వేళ్లను పెట్టేస్తుంటాం. అయితే అలా చేయడం వల్ల చెవులకు హాని కలగడమే కాకుండా వ్యాక్స్‌ను మరింత లోపలకి నెట్టివేస్తుంది. ఇయర్ కెనాల్‌ను అడ్డుకుని, వినికిడి ఇంద్రియాలను ప్రభావితం చేస్తుంది. చెవిపోటుకు హాని కలిగించే బ్యాక్టీరియాను ఆకర్షిస్తుంది.
*ఫుడ్ డిఫ్రాస్ట్
డిఫ్రాస్ట్ (రిఫ్రిజిరేటర్‌లో మంచును తొలగించడం డీఫ్రాస్టింగ్) చేయడానికి కౌంటర్‌లో ఆహారాన్ని ఉంచడం ఉత్తమమైన పద్ధతికాదని నిపుణులు చెబుతున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ యూఎస్ ప్రకారం 40 డిగ్రీల కంటే ఎక్కువ టెంపరేచర్ మాంసంలో బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
* ఇయర్‌బడ్‌లను శుభ్రం చేయడం:
ఇయర్‌బడ్‌లను శుభ్రం చేయడం చాలా అవసరం. ఎందుకంటే శుభ్రం చేయకుండా వదిలేస్తే దద్దుర్లు, అలెర్జీలు, ఇన్ఫెక్షన్లతో పాటు ఇతర చెవి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల స్నానం చేసిన తర్వాత సున్నితమైన కాటన్ వస్తువుతో ఇయర్‌బడ్‌లను క్లీన్ చేయడం శ్రేయస్కరం.
* నిద్రించే ముందు కాంటాక్ట్ లెన్స్‌లు తీయడం:
చాలా మంది పడుకునే సమయంలో బ్యాక్టీరియా, జెర్మ్స్ నుంచి కళ్లను కాపాడుకోవటానికి కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తారు. అయితే అలా ధరించి నిద్రపోవడం సురక్షితం కాదని ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. కాంటాక్ట్ లెన్స్‌లతో నిద్రించడం వల్ల కార్నియల్ ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. ఇది కంటి కలర్ భాగాన్ని రక్షించే స్పష్టమైన పొర ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. కాబట్టి నిద్రించే కొన్ని గంటల ముందు లెన్స్‌లు తీయడం మంచిదని సూచిస్తున్నారు.
* చేతులు అడ్డుపెట్టి తుమ్మడం:
తుమ్మే సమయంలో చాలా మంది అరచేతులు అడ్డుపెడుతుంటారు. అలా చేయడం వలన చేతులపైకి వచ్చే హానికరమైన జెర్మ్స్.. మీతోపాటు ఇతరులపై కూడా హానికర ప్రభావాలు చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
* గోళ్లు కొరకడం:
చాలామంది ఈ చెడు అలవాటుకు బానిసలవుతున్నారు. ఇలా గోళ్లు కొరకడం వలన గోళ్ల కింద ఉండే సూక్ష్మక్రిములు నేరుగా నోటి ద్వారా బాడీలోకి ప్రవేశించడానికి ప్రత్యక్షమార్గాన్ని అందిస్తుంది. అంతేకాకుండా దంతాలపై అత్యంత ప్రమాదం చూపిస్తుంది. ఎనామిల్‌ను నాశనం చేస్తుంది. కాబట్టి ఇటువంటి హ్యాబిట్స్‌పై దృష్టి పెట్టి వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
* లోఫర్ షూస్ మార్చడం:
ప్రస్తుతం ట్రెండింగ్ షూస్‌లో లోఫర్స్‌కు మంచి డిమాండ్ ఉంది. అయితే వీటిని ధరించే వారి కాళ్ల కింద తేమ లాంటి స్వభావం ఏర్పడుతుంది. అది బ్యాక్టీరియాకు సరైన సంతానోత్పత్తి స్థలాన్ని అందిస్తుంది. ఇక అలాంటి సమయంలో కాళ్లల్లో చిన్న చిన్న గాయాలతో కట్ అయినట్లు ఉన్నా వెంటనే ఇన్ఫెక్షన్ చేరిపోతుంది. తద్వారా అధిక ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది.
* టీ కప్పులు:
ఆరిజో విశ్వవిద్యాలయం జరిపిన ఒక అధ్యయనం ప్రకారం.. 20శాతం ఆఫీసు మగ్‌లలో మల బ్యాక్టీరియా ఉంటుందని.. 80శాతం ఇతర సూక్ష్మక్రిములు ఉంటాయని వెల్లడించింది. ఒకసారి కప్పును యూజ్ చేసిన తర్వాత మరలా దాన్ని వేడి నీళ్లతో వాష్ చేసి ఉపయోగించడం శ్రేయస్కరం. లేదంటే జెర్మ్స్ అనేవి సుమారు 3రోజుల వరకు అందులో జీవిస్తాయని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- Tags
- Healthtips