Bad cholesterol : శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు.. డిమెన్షియాకు అదే కారణం!

by Javid Pasha |
Bad cholesterol : శరీరంలో పేరుకుపోతున్న కొవ్వు.. డిమెన్షియాకు అదే కారణం!
X

దిశ, ఫీచర్స్ : శరీరానికి మంచి కొవ్వులు కొంత మేరకు అవసరమే.. కానీ చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే మాత్రం రిస్క్ తప్పదు. అనేక రోగాలకు కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా ధమనుల్లో రక్త ప్రసరణకు ఆటంకం కలిగించడం ద్వారా గుండె ఆరోగ్యంపై, జ్ఞాపక శక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. లాన్సెట్ కమిషన్ అధ్యయనం పేర్కొన్నది. తాజాగా చెడు కొలెస్ట్రాల్ డిమెన్షియా, దృష్టిలోపం వంటి సమస్యలతో కూడా ముడిపడి ఉన్నట్లు మరోసారి వెల్లడైంది.

చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో 40 ఏండ్ల వయస్సు వచ్చాక డిమెన్షియా ముప్పు 7 శాతం పెరుగుతుందని లాన్సెట్ స్టడీ పేర్కొన్నది. ఆ తర్వాత మలి వయస్సులో 2 శాతం మేర కంటిచూపు కోల్పోయే అవకాశం ఉందని వెల్లడించింది. అంతేకాకుండా జ్ఞాపక శక్తి, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం తగ్గడం, అల్జీమర్స్ పెరగడం, అధిక రక్తపోటు, డయాబెటిస్, ఒబేసిటీ వంటి మొత్తం 12 రకాల కారణాలు కూడా చెడు కొలెస్ట్రాల్‌తో ముడిపడి ఉంటాయని నిపుణులు పేర్కొంటున్నారు.

2020 లాన్సెట్ కమిషన్ స్టడీ ప్రకారం.. అప్పట్లో వరల్డ్ వైడ్‌గా 5.7 కోట్లుగా ఉన్న డిమెన్షియా వ్యాధి కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. 2050 నాటికి మూడింతలు పెరగనున్నాయి. ఇప్పటికే ఇండియాలో 60 ఏండ్లు పైబడిన వారిలో 3.4 కోట్ల మంది స్వల్ప స్థాయి డిమెన్షియాను ఎదుర్కొంటన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

మారుతున్న జీవన శైలి, ఫైబర్‌, విటమిన్లు వంటి పోషకాలు లేని ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానం, హైకేలరీలు, జంక్ ఫుడ్స్, అధిక చక్కెరలు తీసుకోవడం, ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం వంటివి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వాటికి అడ్డుకట్ట వేయడం ద్వారా డిమెన్షియా సహా గుండె జబ్బుల రిస్క్ నుంచి తప్పించుకోవచ్చునని చెప్తున్నారు.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed