స్వీట్స్ లవర్స్ ఇవి పాటించకపోతే ముప్పే.. ఏ సమయంలో తినాలి?

by Anjali |
స్వీట్స్ లవర్స్ ఇవి పాటించకపోతే ముప్పే.. ఏ సమయంలో తినాలి?
X

దిశ, వెబ్‌డెస్క్: స్వీట్ లవర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. చాలా మంది హాట్ కంటే ఎక్కువగా స్వీట్ అంటేనే ఎక్కువగా ఇష్టపడతారు. ఏ పని మీద బయటికెళ్లినా.. ఒకవేళ అక్కడ స్వీట్స్ కనిపిస్తే కొనకుండా ఉండలేరు. ఫ్రిడ్జ్‌లో పెట్టి ఖాళీ సమయంలో కూడా టైమ్‌పాస్‌కు తీపి పదార్థాలను లాగించేస్తుంటారు. పలువురికి భోజననంతరం తప్పకుండా స్వీట్ తినే అలవాటు ఉంటుంది. అయితే ఎప్పుడు పడితే అప్పుడు తీపి పదార్థాలు తినడం మంచిది కాదు. స్వీట్లు తినడానికి కూడా సరైన టైమ్ ఉంటుందంటున్నారు నిపుణులు. ఎప్పుడెప్పుడు స్వీట్లు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదో నిపుణులు చెప్పినవి ఇప్పుడు చూద్దాం..

స్వీట్ లవర్స్ ఈ విషయాలు తప్పక గుర్తు ఉంచుకోండి. వ్యాయామానికి ముప్పై నిమిషాల ముందు తీపి పదార్థాలు తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అయితే వ్యాయామానికి ముందు తిన్నట్లైతే.. స్వీట్స్ నుంచి పొందిన కేలరీలు బర్న్ అవుతాయి. అలాగే మధ్యాహ్నం పూట కూడా తీపి పదార్థాలు తినవచ్చు. కాగా స్వీట్స్ తినాలనుకునే వారికి ఇది మంచి సమయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే నైట్ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితిల్లోనూ స్వీట్స్ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. నిద్రపోయే ముందు అయితే అస్సలు తినొద్దని అంటున్నారు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Read More...

.Diabetes: డయాబెటిస్ రోగులు చక్కెర ప్లేస్‌లో ఇవి తీసుకోండి.. తియ్యదనంతో పాటు బోలెడు లాభాలు

Advertisement

Next Story

Most Viewed