అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే బాడీపై ఎఫెక్ట్.. భూమికి చేరుకున్నాక వ్యోమగాముల పరిస్థితి దారుణం...

by Sujitha Rachapalli |
అంతరిక్షంలో ఎక్కువ రోజులుంటే బాడీపై ఎఫెక్ట్.. భూమికి చేరుకున్నాక వ్యోమగాముల పరిస్థితి దారుణం...
X

దిశ, ఫీచర్స్: బోయింగ్ స్టార్ లైనర్ లోపం కారణంగా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బ్యారీ విల్ మోర్ ఇంకా అంతరిక్షంలోనే స్టక్ అయిపోవాల్సి వచ్చింది. జూన్ 5న ప్రయోగించిన స్టార్‌లైనర్ వ్యోమనౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) చేరుకున్న కొద్దిసేపటికే హీలియం లీక్‌, థ్రస్టర్ ఫెయిల్యూర్స్ ఎదుర్కొంది. దీని కారణంగా ఎనిమిది రోజుల్లో పూర్తి కావాల్సిన మిషన్ ఇంకా ఎక్స్ టెండ్ అవుతూనే ఉంది. దాదాపు 27 రోజులు అయిపోతుండగా.. ఇలా అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండటం వల్ల వారి హెల్త్ పై ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎలాంటి ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయో చెప్తున్నారు.


1. మైక్రో గ్రావిటీ వ్యోమగాముల శరీరంలో ఫ్లూయిడ్ రీడిస్ట్రిబ్యూషన్ కు కారణం అవుతుంది. ముఖం ఉబ్బడం, ముక్కు దిబ్బడ, కాళ్లలో ద్రవ పరిమాణం తగ్గడం జరుగుతుంది. ఈ సమస్యలు కార్డియోవాస్క్యులర్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. భూమికి తిరిగి వచ్చాక మైకం, మూర్ఛ కలిగిస్తాయి.

2. కండరాల క్షీణత, ఎముకల నష్టాన్ని కూడా అనుభవిస్తారు. గురుత్వాకర్షణ లేకపోవడం వల్ల బోలు ఎముకల మాదిరిగానే కండర ద్రవ్యరాశి, ఎముక సాంద్రత తగ్గుతుంది. అయితే ISSలో వ్యాయాయం కొంత నష్టాన్ని తగ్గించవచ్చు.

3. ఫ్లూయిడ్ రీడిస్ట్రిబ్యూషన్ మూత్రంలో అధిక కాల్షియం సాంద్రతకు దారితీస్తుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. జీవక్రియ పోషకాల శోషణ, వినియోగాన్ని ప్రభావితం చేస్తుంది. హార్మోనల్ చేంజస్, ఇన్సులిన్ సెన్సిటివిటీ, గట్ మైక్రోబయోటా కూర్పు దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

4. గురుత్వాకర్షణ లేకపోవడం సెన్సారీ ఇన్ పుట్ ను చేంజ్ చేస్తుంది. బాడీ బ్యాలెన్స్, కళ్లు - చేతుల కోఆర్డినేషన్ లేకుండా పోతుంది. కొందరు వ్యోమగాములు వికారం, ఆందోళనతో స్పేస్ మోషన్ సిక్నెస్ అనుభవిస్తారు.

5. ఆస్ట్రోనాట్స్ అంతరిక్షంలో అధిక స్థాయి రేడియేషన్ కు గురవుతారు. దీనివల్ల DNA డ్యామేజ్, క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.

అయితే ఈ అనారోగ్య సమస్యలు పరిష్కరించేందుకు అంతరిక్ష ఏజెన్సీలు మిషన్ సమయంలో, పూర్తి అయ్యాక కఠినమైన వ్యాయామం, పోషకాహార, వైద్య పర్యవేక్షణ అమలు చేస్తాయి. కాగా డెవలప్ అవుతున్న టెక్నాలజీ, బయోమెడికల్ పరిశోధనల్లో పురోగతి అంతరిక్ష ప్రయాణానికి సంబంధించిన శారీరక, మానసిక సవాళ్లపై అవగాహన పెంచుతున్నాయి. ఉపశమనం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed