మౌత్ వాష్ రోజు వాడుతున్నారా? ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..

by Sujitha Rachapalli |
మౌత్ వాష్ రోజు వాడుతున్నారా? ఈ సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..
X

దిశ, ఫీచర్స్: మౌత్ వాష్.. బ్రష్ చేశాక ఓరల్ హెల్త్ కోసం వినియోగించే లిక్విడ్ ప్రొడక్ట్. నోటిని శుభ్రపరిచేందుకు, శ్వాసను ఫ్రెష్ గా ఉంచేందుకు, బ్రషింగ్ ద్వారా జరగని పూర్తి మౌత్ క్లీన్ కు హెల్ప్ చేస్తుంది. బ్యాక్టీరియాను చంపి నోటి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులోని ఫ్లోరైడ్ పళ్లను బలపరచి.. దంతక్షయాన్ని నివారిస్తుంది. ఆస్ట్రింజెంట్స్ నోటిలోని టిష్యూ టైట్ గా ఉండేలా చేస్తాయి. నోటిలో చికాకు, మంటను తగ్గిస్తాయి. అయితే ప్రతిరోజూ మౌత్ వాష్ వినియోగించడం ఆరోగ్యకరమేనా? లేక సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? అంటే దుష్ప్రభావాలు ఎక్కువే అంటున్నారు నిపుణులు.

1. పొడిబారుతున్న నోరు

ఆల్కహాల్ ఆధారిత మౌత్ వాష్‌లు నోటి కణజాలాన్ని డీహైడ్రేట్ చేయడం ద్వారా పొడిబారడానికి కారణమవుతాయి. కాబట్టి ఆల్కహాల్ లేని మౌత్‌వాష్‌లను ఉపయోగించండి, ప్రత్యేకించి మీకు జిరోస్టోమియా ఉంటే నిపుణుల సలహా ఇదే.

2. నోటి చికాకు, మంట

స్ట్రాంగ్ యాంటిసెప్టిక్స్, ఆల్కహాల్ శ్లేష్మ పొరలను చికాకు పెడుతాయి. దీన్ని నివారించడానికి మౌత్‌వాష్‌లను ఎంచుకోండి. సెన్సిటివ్ నోరు కలిగి ఉంటే ఆల్కహాల్ లేనిది చూజ్ చేసుకోండి

3. రుచిలో మార్పు

క్లోరెక్సిడైన్ వంటి పదార్థాలు రుచిలో తాత్కాలిక మార్పును కలిగిస్తాయి. ఇలా జరిగితే.. వేరే మౌత్ వాష్‌కు మారడం లేదా ప్రత్యామ్నాయాల కోసం దంతవైద్యుడిని సంప్రదించడం మంచిది.

4. దంతాలు, నాలుకపై మరకలు

క్లోరెక్సిడైన్ కలిగి ఉన్న మౌత్‌వాష్‌ల దీర్ఘకాలిక ఉపయోగం.. దంతాలు, నాలుకపై గోధుమ రంగు మరకలకు కారణం అవుతుంది. అందుకే వీటిని ప్రిస్క్రైబ్

చేసిన విధంగా మాత్రమే ఉపయోగించాలి. నార్మల్ టీత్ క్లీనర్ గా వాడాలి.

5. సెన్సిటివిటి పెరుగుదల

ఆల్కహాల్ వంటి పదార్థాలు సున్నితమైన నోటి కణజాలం ఉన్న వ్యక్తులలో సెన్సిటివిటి పెంచుతాయి. అందుకే ఆల్కహాల్ లేని ఫార్ములేషన్‌లను... సెన్సిటివ్ మౌత్

కోసం లేబుల్ చేయబడిన వాటిని ఎంచుకోండి.

6. వికారం

అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా మౌత్ వాష్ మింగేయడం వల్ల వికారం, వాంతులు, జీర్ణశయాంతర సమస్యలు వస్తాయి. అందుకే అలాంటి తప్పిదం జరగకుండా మౌత్ వాష్ ను ఎప్పుడూ ఉమ్మివేయాలి.

Advertisement

Next Story

Most Viewed