- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Vinayaka Chavithi 2023 :గణపతిని ప్రతిష్టిస్తున్నారా.. అయితే శుభ ఘడియలివే?
దిశ, వెబ్‌డెస్క్: వినాయక చవితి పండుగకు పట్నంలోని జనాలే కాకుండా పల్లెల్లో ఉండే జనాలు సైతం ఫుల్ ఖుషీ అవుతుంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో కాలనీలన్నీ గణేశుని విగ్రహాలతో నిండిపోతాయి. ప్రతి ఏటా వినాయక చవితి ఎంతో నిష్టగా జరుపుకుంటారు. అయితే, ఈ సారి గణపతి పండుగ 18, 19 తేదీల్లో వచ్చింది. రెండు రోజులు రావడంతో ఏ రోజు వినాయకుడిని తీసుకురావాలనే దీనిపై జనాల్లో పెద్ద గందరగోళం ఏర్పడింది. పండితుల సలహా మేరకు 18న పండుగ ప్రారంభం కానుంది.
అయితే ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆ పండుగకు సంబంధించిన శుభ ఘడియలు ఉన్న సమయంలోనే జరుపుకోవాలని పండితులు కూడా చెబుతుంటారు. వినాయకుడిని శుభ ఘడియల్లో ఇంటికి తీసుకువస్తే సంతోషం, శ్రేయస్సు కలిగి జీవితంలో కలిగే ఇబ్బందులు, బాధలు అన్నీ తొలగిపోతాయట. గణపతి బప్పాను ఇంటికి ఏ సమయంలో తీసుకురావాలన్న విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. సెప్టెంబర్ 18న ఉదయం 11: 51 నుండి మధ్యాహ్నం 12: 40 వరకు మంచి ముహూర్తం ఉంది. మళ్లీ మధ్యాహ్నం 12: 39 నుంచి మరుసటి రోజు 19 రాత్రి 8: 43 వరకు ఉంది.
ఈ ఘడియల్లో వినాయకుడిని ఇంటికి తీసుకొచ్చి ప్రతిష్టించుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. అలాగే ఇంట్లో గణపతిని పెట్టే స్థలం శుభ్రం చేసుకోవాలని.. ఆ తర్వాత ఎరుపు లేదా పసుపు వస్త్రాన్ని వేయాలని. దానిపై గంగాజలాన్ని చల్లి.. గణపతి విగ్రహానికి పసుపు, బియ్యం, చందనం, మౌళి, మోదకం, పండ్లు, పువ్వులు సమర్పించాలని పేర్కొన్నారు.