వాడేసిన మెడిసిన్‌ కవర్లు పారేస్తున్నారా.. వాటితో ఈ చిట్కాలు ట్రై చేస్తే తళ తళ మెరిసే కిచెన్‌ మీ సొంతం

by Kavitha |
వాడేసిన మెడిసిన్‌ కవర్లు పారేస్తున్నారా.. వాటితో ఈ చిట్కాలు ట్రై చేస్తే తళ తళ మెరిసే కిచెన్‌ మీ సొంతం
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా కిచన్‌లో డిఫరెంట్ టైఫ్స్ ఆఫ్ బౌల్స్ యూజ్ చేస్తూ ఉంటాము. వాటిలో కడాయి, తవా ఇలా ఆయా వంటల కోసం అనేక రకాల పాత్రలను వాడుతుంటాం. ఇక వంట చేసే క్రమంలో పాత్రలు మాడిపోవడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఇలా నల్లగా మాడిపోయిన వంట పాత్రలు శుభ్రం చేయడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాటిని క్లీన్ చేయడం కోసం డిటర్జెంట్, లిక్విడ్స్, బూడిద వంటివి వాడుతుంటారు. అయినప్పటికి వంటపాత్రలకు మునుపటి మెరుపు తీసుకోలేకపోతారు. అలాంటప్పుడు ఈ వంటగది చిట్కాలు మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

మీ వంటింట్లో మాడ గొట్టిన వంటపాత్రలు తిరిగి కొత్తవిగా చూడాలనుకుంటే ఇందుకోసం మీరు మీ ఇంట్లో ఉన్న ఖాళీ మెడిసిన్ షీట్స్‌ని వాడేసిన తర్వాత వాటిని పరేయకుండా నిల్వ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఖాళీ మెడిసిన్ రేపర్లు మీ వంటగది పనిని సులభతరం చేస్తాయి.

*వంట చేస్తుండగా మాడిపోయిన కడాయి, పాన్‌ మునుపటిలా మెరవాలంటే.. ముందుగా దానిపై ఉప్పు, స్వీట్ సోడా లేదా ఈ నో వేసి కొద్దిగా వేడి నీరు పోయాలి. ఇప్పుడు మెడిసిన్ రేపర్ సహాయంతో 2-4 నిమిషాలు రుద్దండి. ఈ ట్రిక్ వాడకంతో మీ వంటింట్లోని తవా, లేదంటే పాన్ మునుపెన్నడూ లేని విధంగా మెరుస్తుంది.

*అలాగే మొండిబారిన కత్తెర అంచులకు పదును పెట్టేందుకు కూడా మెడిసిన్‌ కవర్‌ ఉపయోగపడుతుంది. ఇంట్లో ఉపయోగించే కత్తెర అంచు మెడిసిన్‌ కవర్ సహాయంతో పదును పెట్టవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక రేపర్ తీసుకుని మొండి బారిన కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తూ ఉండాలి. దీన్ని కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు చేస్తూ ఉంటే..కత్తెర అంచు చాలా పదునుగా మారుతుంది.

*అదేవిధంగా మీరు మిక్సర్ గ్రైండర్ బ్లేడ్‌లను మెడిసిన్ రేపర్‌తో పదును పెట్టవచ్చు. దీని కోసం ముందుగా కత్తెరతో మెడిసిన్ రేపర్ చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఆ తర్వాత ముక్కలన్నీ ఒక మిక్సీ జార్‌లో వేసి రెండు నిమిషాలపాటు తిప్పాలి. ఈ ట్రిక్ సహాయంతో, మిక్సర్ బ్లేడ్ అంచులు పదునుగా మారుతుంది.

Advertisement

Next Story